Viral Video: విమానంలో బుడ్డోడు చేసిన పనికి అందరూ ఫిదా
Viral Video Of a Toddler On Flight: చిన్న వయస్సులో బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్లే పిల్లలు ఏం చేసినా ముద్దుగానే ఉంటుందంటుంటారు. కానీ కొన్నిసార్లు చిన్నారులు వారి వయసుకు మించి చేసే పనులు పెద్ద వాళ్లను కూడా ఔరా అని ముక్కున వేలేసుకునేలా చేస్తాయి.
Viral Video Of a Toddler On Flight: చిన్న వయస్సులో బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్లే పిల్లలు ఏం చేసినా ముద్దుగానే ఉంటుందంటుంటారు. కానీ కొన్నిసార్లు చిన్నారులు వారి వయసుకు మించి చేసే పనులు పెద్ద వాళ్లను కూడా ఔరా అని ముక్కున వేలేసుకునేలా చేస్తాయి. ఆ చిన్నారి చుట్టూ ఉన్న వాళ్లను మంత్రముగ్దులను చేస్తాయి. మనం కూడా అలాంటి అనుభూతి పొందాలంటే.. అలాంటి ఘటనలను నేరుగానే చూడనక్కర్లేదు.. వాటిని వీడియోలను చూసినా మనకు కూడా అక్కడ లైవ్ లో ఉన్న వారిలాగే సేమ్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నట్టు అని అనుకుంటున్నారా ? అయితే, ఇదిగో ఇప్పుడు మేం చూపించబోయే వీడియో చూస్తే మీకు ఓ క్లారిటీ వచ్చేస్తుంది.
విమానంలో తోటి ప్రయాణికుల సీట్ల మధ్యలోంచి అందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్తున్న ఓ బుడ్డోడు.. తాను వెళ్లే దారిలో అటువైపు, ఇటువైపు సీట్లలో కూర్చున్న వాళ్లందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ వెళ్తున్న వీడియో చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. బుడ్డోడికి చేయిచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడంలో విమానంలో ఉన్న ప్రయాణికులు ఎలాంటి అనుభూతినైతే పొందుతున్నారో.. ఈ వీడియో చూసిన వాళ్లు కూడా ఇంచుమించు అలాంటి క్యూట్ నెస్ ని ఆస్వాదిస్తున్నారు.
ఈ బుడ్డోడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే 2 మిలియన్స్ వ్యూస్ రాగా.. 53 వేల మందికిపైగా ట్విటర్ యూజర్స్ ఈ వీడియోను లైక్ చేశారు. అచ్చం పెద్ద వాళ్లు ఎలాగైతే కొత్త వాళ్లను కలిసినప్పుడు ఒకరి తరువాత మరొకరిని వరుక క్రమంలో ఎలాగైతే కలుస్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ వెళ్తారో.. అచ్చం అలాగే ఈ బుడ్డోడు కూడా ప్రయాణికులకు షేక్ హ్యాండ్ ఇస్తూ వెళ్లడం చూసి ప్రయాణికులే ముచ్చటపడిపోతున్నారు.