Dil Raju: దిల్ రాజులో ఈ టాలెంట్ కూడా ఉందా.. వైరల్‌గా మారిన ఆ వీడియో...
Dil Raju Singing Video: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజులో సింగింగ్ టాలెంట్ కూడా ఉన్నట్లుంది. ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అలనాటి నాగార్జున-అమల క్లాసిక్ సాంగ్‌ను దిల్ రాజు అద్భుతంగా ఆలపించారు.
Dil Raju Singing Video: ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు (Dil Raju) సింగర్ అవతారమెత్తారు. ఏదో మొహమాటానికి ఒకటి, రెండు లైన్లు పాడటం కాదు.. ఆర్కెస్ట్రా టీమ్‌తో కలిసి మొత్తం పాటను హుషారుగా ఆలపించారు. 'హలో గురు ప్రేమ కోసమేరో జీవితం...' అంటూ ప్రొఫెషనల్ సింగర్ తరహాలో అదరగొట్టారు. ఇటీవల కరీంనగర్‌లో ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంగా దిల్ రాజు ఇలా సింగర్ అవతారమెత్తారు.
రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి దిల్ రాజు (Dil Raju), కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో (Gangula Kamalakar) పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ ఆర్కెస్ట్రా టీమ్‌తో మ్యూజికల్ పెర్ఫామెన్స్ ఏర్పాటు చేశారు. స్టేజీపై ఆ టీమ్ పాటలు ఆలపిస్తుండగా... వారి దృష్టి దిల్ రాజుపై పడింది. తమతో కలిసి పాట పాడేందుకు స్టేజీ పైకి రావాలని దిల్ రాజును ఆ టీమ్ ఆహ్వానించింది. అయితే మొదట దిల్ రాజు అందుకు నో చెప్పారు.
కానీ ఆ తర్వాత కాసేపటికే దిల్ రాజు (Dil Raju) స్టేజీ పైకి వెళ్లి మైక్ అందుకున్నారు. ఆర్కెస్ట్రా టీమ్‌తో కలిసి 'హలో గురు ప్రేమ కోసమేరో ఈ జీవితం...' అంటూ ఉత్సాహంగా పాట పాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. దిల్ రాజు నిర్మాతే కాదు... ఆయనలో మంచి సింగర్ కూడా ఉన్నాడని వీడియో చూసిన జనాలు అభిప్రాయపడుతున్నారు.
కాగా, 1990'ల్లో విడుదలైన నిర్ణయం సినిమాలోని 'హలో గురు ప్రేమ కోసమేరో..' సాంగ్ అప్పట్లో కుర్రకారును ఓ ఊపు ఊపింది. నాగార్జున-అమల జోడీ (Nagarjuna), ఇళయరాజా సంగీతంతో ఆ సాంగ్ ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌గా నిలిచిపోయింది.
Also Read: 66 ఏళ్ల వృద్దురాలికి మిడిల్ ఫింగర్ చూపించి హేళన-ఆర్నెళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook