Tractor Started Without Driver Viral Video: కొన్ని ఘటనలు చూస్తుంటే మన కళ్లను మనం నమ్మలేం. ఒకవేళ నమ్మినా.. ఆ ఘటన చూసిన తరువాత ఎదురయ్యే ప్రశ్నలకు ఎంతకీ సమాధానం దొరకదు. అలాంటి ఘటనే ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియో. ఓ దుకాణం ముందు ట్రాక్టర్ ఇంజన్ పార్క్ చేసి ఉంది. దుకాణం లోపల ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు. ఇంతలో దుకాణం బయట పార్క్ చేసి ఉన్న ట్రాక్టర్ ఇంజన్ కి పూనకం వచ్చింది. డ్రైవర్ లేకుండానే ఎవరో స్టార్ట్ చేసినట్టుగా దానంతట అదే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన ట్రాక్టర్ అంతటితో ఆగితే బాగానే ఉండేది. కానీ అది ఆన్ అయినప్పుడు గేర్ లో ఉండటం వల్ల ట్రాక్టర్ మోషన్ తీసుకుని ముందుకు కదలడం మొదలుపెట్టింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్రాక్టర్‌కి ఎదురుగానే దుకాణం. దుకాణం మెట్లు అడ్డం వచ్చినా అవేవి ట్రాక్టర్ ని ఆపలేకపోయాయి. ఆ మెట్లను కూడా దాటుకుని వచ్చి దుకాణం అద్దాలను ఢీకొట్టింది. ఆ సమయంలో ట్రాక్టర్ ఇంజన్ మోషన్ నెమ్మదిగా ఉండటంతో దుకాణం అద్దాలు సాధ్యమైనంత వరకు ట్రాక్టర్ ని నిరోధించే ప్రయత్నం చేశాయి. కానీ ట్రాక్టర్ నెమ్మదిగా వేగం పుంజుకోవడంతో ఆ అద్దాలు కూడా పగిలిపోయాయి. అద్దాలను పగలకొట్టుకుని ముందుకొచ్చిన ట్రాక్టర్ ని ఈసారి మరో మెట్టు అడ్డం పడింది. అంతలోనే దుకాణంలోంచి బయటికి పరుగెత్తిన సిబ్బంది ఒకరు.. ట్రాక్టర్ బ్రేకుపై చేయి వేసి ఒత్తిపట్టాడు. అంతలోనే మరో వ్యక్తి పరుగెత్తుకొచ్చి డ్రైవర్ సీటులోకి ఎక్కికూర్చుని ట్రాక్టర్ ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. 

ఉత్తర్ ప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దుకాణం ఎదురుగానే కోత్వాలి పోలీసు స్టేషన్ ఉంది. పోలీసు స్టేషన్‌లో జరిగిన సమాధాన్ దివాస్‌లో పాల్గొంటానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో ఒకరు కారు తీసుకురాగా .. కిషన్ కుమార్ అనే మరో వ్యక్తి ట్రాక్టర్ తీసుకొచ్చాడు. కిషన్ కుమార్ ఆ ట్రాక్టర్‌ని ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న షోరూమ్‌కి ఎదురుగా పార్క్ చేశాడు. పార్క్ చేసిన తరువాత గంటసేపటికి ట్రాక్టర్ తనంతట తనే స్టార్ట్ అయి ఈ బీభత్సం సృష్టించింది. ఈ దృశ్యం మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అందరి మెదళ్లను తొలిచేస్తోన్న ప్రశ్న ఒక్కటే.. ట్రాక్టర్ డ్రైవర్ లేకుండానే దానంతట అదే ఎలా స్టార్ట్ అయింది అని అందరూ జుట్టు పీక్కుంటున్నారు. మీకైమైనా తడితే మా సోషల్ మీడియా పేజీలలో కామెంట్స్ రూపంలో రాయండి.