Kumari Aunty Case: తన రుచికరమైన ఆహారంతో ప్రజల ప్రశంసలు అందుకుంటున్న కుమారి ఆంటీకి పోలీసులు భారీ షాక్‌ ఇచ్చారు. రోడ్డుపై పెట్టిన స్ట్రీట్‌ ఫుడ్‌తో లక్షలు సంపాదిస్తోందని సోషల్‌ మీడియాలో కుమారి ఆంటీ వీడియోలు ట్రెండింగ్‌ అవుతున్నాయి. దీంతో ఆమె ఒక్కసారిగా సోషల్‌ మీడియా స్టార్‌గా ఎదిగారు. వేలాది మంది ప్రజలు తరలివస్తుండడంతో ఆమె బండి వద్ద కిటకిటలాడుతోంది. ఆంటీ బండి వద్ద తినేందుకు వస్తున్న ప్రజలతో అక్కడ ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. ట్రాఫిక్‌ జామ్‌ కావడానికి కారణమైన కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జి సమీపంలో కోహినూర్‌ హోటల్‌ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కుమారి ఆంటీ ఆహార బండి ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం పూట శాఖాహారం, మాంసాహార భోజనం అందుబాటులో ఉంచారు. ఇంటి వద్ద చేసినట్టు ఉండే రుచి ఉండడంతో ప్రజలు అక్కడ తినేందుకు అలవాటు పడ్డారు. ఆమె భోజనం రుచి తెలిసిన వారంతా క్రమంగా అక్కడకు రావడం మొదలుపెట్టారు. ఇక కుమారి ఆంటీకి సంబంధించిన బండిపై కొన్ని యూట్యూబ్‌ చానళ్లు ఇంటర్వ్యూలు చేశారు.

ట్రాఫిక్ కు అంతరాయం
ఈ బండి ద్వారా ఆమె రోజుకు దాదాపు లక్ష వరకు సంపాదిస్తున్నట్లు ఆ వీడియోల్లో ఉంది. దీంతో ఒక్కసారిగా ఆమె యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేసుబుక్‌, యూట్యూబ్‌ ఇలా అన్ని సోషల్‌ మీడియాల్లో కుమారి ఆంటీ వైరల్‌ అయ్యారు. ఇది చూసిన జనాలు అక్కడకు రావడం ప్రారంభించడంతో పెద్ద ఎత్తున కుమారి ఆంటీ వద్ద రద్దీ పెరిగింది. రోజు పెద్ద సంఖ్యలో వస్తున్న ప్రజలతో కేబుల్‌ బ్రిడ్జి, కోహినూర్‌ హోటల్‌ వద్ద వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో పోలీసులు కుమారి ఆంటీపై కేసు నమోదు చేశారు. అక్కడితో ఆగకుండా బండి మూసేయాలని పోలీసులు ఆదేశించడంతో కుమారి ఆంటీ వాగ్వాదానికి దిగింది. దీంతో కొద్దిసేపు అక్కడ గందరగోళం ఏర్పడింది.


కేసు నమోదుపై కుమారి ఆంటీ మీడియాతో మాట్లాడారు. 'మీడియా వలనే ఇలా జరిగింది. అసలు మమ్మల్ని చూపించాలని మీడియాను అడిగలేదు. ఇప్పుడు మీడియా వాళ్లు నాకు న్యాయం చేయాలి. రోజు మాదిరి బండి పెట్టుకుంటే పోలీసులు అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు జనాలు పెరగడంతో ట్రాఫిక్‌ జామ్‌ వలన ఈరోజు మా బండి నడవలేదు. ట్రాఫిక్‌ అంతరాయం కలగించకుండా ఉండమని కోరుతున్నా ప్రజలు వినడం లేదు. ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు' అని కుమారి ఆంటీ వాపోయింది. మరి కేసు నమోదు చేయడంతో కుమారి ఆంటీ ఏం చేస్తుందో చూడాలి. కాగా కుమారి ఆంటీకి కొందరు అండగా నిలబడుతున్నారు.
Also Read: Assistant Loco Pilot Jobs: పదో తరగతి పాసైతే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కొట్టేయొచ్చు


Also Read: Telangana High Court: తెలంగాణలో అనూహ్య మలుపు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి బ్రేక్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి