Truck parts continue to roll on road: సోషల్ మీడియాలో ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో తెలీదు, ఎందుకు ట్రెండ్ అవుతుందో కూడా తెలియదు.. ఒక్కసారి ఏదైనా ట్రేండింగ్ లో వచ్చిందంటే... ఇంకా అంతే సంగతి.. కొంత కాలం పాటు వాటి హావ నెట్ లో కొనసాగుతూనే ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైరల్ వీడియో లు ఫన్నీగా నే కాదు కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి మరి కొన్ని వీడియోలు అయితే భయంతో వణికేలా చేస్తుంటాయి. తాజాగా నెట్టింట్లో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే... ప్రమాదానికి గురైన లారి రెంఫు ముక్కలు అయినప్పటికీ.... టైర్ లు కలిగిన లారీ కింది భాగం ఆగకుండా ముందుకు వెళ్ళటం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. 


Also Read: Weight loss tips: సారా అలీ ఖాన్ వెయిట్ లాస్ సీక్రెట్స్, Beauty tips ఏంటో తెలుసా ?




ఈ వీడియోలో మట్టి రోడ్డుపై నడుచుకుంటూ ఇద్దరు వ్యక్తులు వెళ్తుంటారు... వెనకాలే ఒక లారీ భారీ లోడ్ తో టర్నింగ్ దగ్గర టర్న్ తీసుకొని వస్తుంటుంది. బురదగా ఉండే రోడ్డు.. పైగా గతుకులు కూడా ఎక్కువగా ఉన్నందున లారీ అదుపుతప్పి కింద పడిపోతుంది. అయితే లారీ బోల్తా పడి... పై భాగం కింద పడిపోయినప్పటికీ.. చక్రాలు ఉన్న కింద భాగం రోడ్డుపై ముందుకు వెళ్తుంది. లారీలోంచి డ్రైవర్ భయట పడటం.. ముందుకు వెళ్తున్న కింద భాగం వెనకాల పరిగెత్తటం వీడియోలో చూడవచ్చు. 


వీడియో చూడటానికి ఫన్నీగానే ఉన్న రోడ్డుపై నడిచే వ్యక్తుల ప్రాణాలు మరియు లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. వీడియో చూసిన కొంత మంది నెటిజన్లు "శరీరాన్ని వదిలి వెళ్తున్న ఆత్మ" అని కామెంట్ చేస్తున్నారు. ఈ ఘటన ఎక్క్కడ, ఎప్పుడు జరిగిందన్న విషయం తెలియనప్పటికీ.. 14 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో తెగ వైరలవుతుంది. 


Also Read: Saidabad Girl Case: సైదాబాద్‌ బాలిక కేసులో కీలక నిర్ణయం, నిందితుడిని పట్టించిన వారికి పెద్ద మొత్తంలో రివార్డ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook