Turtle hi-fives alligator: మొసలికి హై-ఫైవ్ ఇచ్చిన తాబేలు
ఆనందం వచ్చినప్పుడు, ఏదైనా సాధించిన సంతోషంలో ఉన్నప్పుడు మనం ఒకరికొకరం హై-ఫైవ్ ( Hi-fives ) ఇచ్చుకుంటుంటాం. కానీ నీళ్లలో ఉండే మొసలి, తాబేలు ఒకదానికొకటి హై-ఫైవ్ ఇచ్చుకుంటాయని ఎవరైనా ఊహిస్తారా ? ఎవ్వరూ ఊహించరు. ఎందుకంటే తాబేలు కనబడిందంటే చాలు మొసలి దానిని గుటుక్కున మింగేస్తుంది కనుక.
ఆనందం వచ్చినప్పుడు, ఏదైనా సాధించిన సంతోషంలో ఉన్నప్పుడు మనం ఒకరికొకరం హై-ఫైవ్ ( Hi-fives ) ఇచ్చుకుంటుంటాం. కానీ నీళ్లలో ఉండే మొసలి, తాబేలు ఒకదానికొకటి హై-ఫైవ్ ఇచ్చుకుంటాయని ఎవరైనా ఊహిస్తారా ? ఎవ్వరూ ఊహించరు. ఎందుకంటే తాబేలు కనబడిందంటే చాలు మొసలి దానిని గుటుక్కున మింగేస్తుంది కనుక. నీళ్లలో మొసలి వేటాడి తినే ఆహారంలో తాబేలు కూడా ఒకటి. కానీ ఇక్కడ ఇదిగో ఈ వీడియోలో కనిపించే ఈ దృశ్యం చూస్తే మాత్రం అందుకు రివర్సుగా ఉంటుంది. మొసలిని చూసిన ఓ తాబేలు దానికి దూరంగా పారిపోవాలని ప్రయత్నించకుండా.. ఎటువంటి ప్రాణభయం లేకుండా ధైర్యంగా మొసలి వద్దకు వెళ్లి కూల్‌గా హై-ఫైవ్ ఇవ్వడం ( Turtle hi-fives alligator ) ఈ వీడియోలో చూడొచ్చు. Also read : Viral video: కోతికి గిఫ్ట్ ఇస్తే.. కోతి ఫేస్‌లో ఆ ఎక్స్‌ప్రెషన్ చూసి తీరాల్సిందే
మొసలి ( Crocodile ) దగ్గరికి వెళ్లి హై-ఫైవ్ ఇచ్చి మళ్లీ తన దారిలో తాను వెళ్లిపోయే తాబేలుని ( Turtle ) చూస్తే.. ఎవరైనా ఆ తాబేలు ధైర్యాన్ని, కూల్ నేచర్‌ను మెచ్చుకోకుండా ఉండలేరు. యాటిట్యూడ్, తెగువ మనుషులకే కాదు.. మూగ జీవాలకూ ఉంటుందని ఈ తాబేలు నిరూపించింది. గేటర్స్ డైలీ అనే ట్విటర్ హ్యాండిల్ షేర్ చేసుకున్న ఈ వీడియోను ఇప్పటికే 174.5 మంది నెటిజెన్స్ రిట్వీట్ చేయగా 588.3 మంది నెటిజెన్స్ లైక్ చేశారు. Also read : Lion vs Crocodile: అడవికి రాజు.. మొసలి నోటిలో కాజూ అయ్యాడు
మరిన్ని ఆసక్తికరమైన కథనాలు, వీడియోస్ కోసం..
- Chicken Vs Crocodile: ఈ మొసలికి టైమ్ సెన్స్ బొత్తిగా తెలియదే..
- Viral video: స్విమ్మింగ్ కోసం వెళ్తే ఏమైందో చూడండి
- ముగ్గురు అమ్మాయిలు.. ఒక ఎలుగుబంటి.. తర్వాత ఏం జరిగింది ?