ఈ రెండు పాములను చూసి.. 200 కింగ్ కోబ్రాలను పట్టుకున్న అమ్మాయి కూడా పారిపోయింది! చివరికి ఏమైందంటే
Viral Video, Lady Snake Catcher Caught 2 King Kobras with Bare Hands. 200 కింగ్ కోబ్రాలను పట్టుకున్న ఓ అమ్మాయి రోడ్డుపై పడగ విప్పిన రెండు భారీ కింగ్ కోబ్రాలు చూసి పారిపోయింది.
Fearless Lady Snake Catcher Catching 2 Angry King Kobras with Bare Hands: సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. జంతువులకు సంబందించిన వీడియోస్ బాగా చక్కర్లు కొడుతుంటాయి. ఇటీవలి కాలంలో ఎక్కువగా పాములకు సంబందించిన వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోలలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలు భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. అలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియో ప్రకారం... ఈ ఘటన కొరియాలో చోటుచేసుకునట్లు తెలుస్తోంది. 200 కింగ్ కోబ్రాలను పట్టుకున్న ఓ అమ్మాయి, మరో అబ్బాయి రోడ్డుమీద బైక్‌లపై వెళుతుంటారు. వారు ఓ మూల మలుపు తిరగగానే.. రోడ్డుపై పడగ విప్పిన రెండు భారీ కింగ్ కోబ్రాలు కనిస్తాయి. వాటిని చూడగానే ఇద్దరు భయంతో బైక్‌లను వదిలేసి అక్కడినుంచి పారిపోతారు. ఆపై ఇద్దరు కలిసి వాటిని పట్టుకోవడానికి వస్తారు. వీరికి తోడు ఇంకో అతను కూడా స్నేక్ స్టిక్స్, బాగ్స్ పట్టుకొని వస్తాడు.
ముగ్గురు కలిసి ముందుగా ఓ కింగ్ కోబ్రాను పట్టు కోవడానికి ప్రయత్నిస్తారు. అది మాత్రం వారికి అస్సలు చిక్కదు. తోక పట్టుకోగానే కాటేయడానికి మీదికి దూసుకొస్తుంది. అయినా కూడా వెనక్కి తగ్గని వారు దాన్ని బంధిస్తారు. ఆపై మరో పాముని కూడా ముగ్గురు కలిసి బంధిస్తారు. ఇందుకు సంబందించిన వీడియోను 'Giant King Cobra' అనే యూట్యూబ్ ఛానెల్ అప్లోడ్ చేసింది. ఈ వీడియోను 2022 అక్టోబర్ 20న పోస్ట్ చేయగా.. 20 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.
Also Read: బాబోయ్.. వేట మామూలుగా లేదుగా! భారీ పాచ్-నోస్డ్ పామును సునాయాసంగా మింగేసిన కింగ్ స్నేక్
Also Read: టీమిండియా 'టీస్ మార్ ఖాన్ ఏం కాదు'.. టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమిస్తుంది: అక్తర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook