Today Google Viral Video: స్నేహితుడి పెళ్లి అయినా.. సొంత ఇంట్లో పెళ్లి అయినా.. బంధువుల పెళ్లి అయినా.. వధూవరుల తర్వాత మొత్తం మనమే హైలెట్ అవ్వాలని అందరూ కోరుకుంటారు. కానీ చీర కట్టుకుని పెళ్లికి వెళ్తున్న అబ్బాయిలను ఎప్పుడైనా చూశారా..? ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఇద్దరు అబ్బాయిలు ఇలాంటి ధైర్యమే చేశారు. ఎలాంటి సిగ్గు పడకుండా తమ భారతీయుడు పెళ్లికి ధోతీ-కుర్తాకు బదులుగా చీరను ధరించి వెళ్లారు. ఇందుకు సంబధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వీడియోలో ఇద్దరు అబ్బాయిలు తమ స్నేహితుడి పెళ్లికి చీర కట్టుకోవడానికి ఒక మహిళ సహాయం చేయడం మనం చూడవచ్చు. చికాగోలోని మిచిగాన్ అవెన్యూలో పెళ్లికి వెళ్లేందుకు రంగురంగుల చీరలు కట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు. వారు భారతీయులిగా కనిపించేందుకు తమ నుదుటిపై బొట్టు కూడా పెట్టుకున్నారు. పెళ్లి వద్ద వారిద్దరిని చూసిన వరుడు, వధువు నవ్వు ఆపులేకపోయారు. వధువు ఓ చాటు నుంచి వారిద్దరిని చూసి తెగ నవ్వేసింది. ఇక పెళ్లి కొడుకు అయితే తన స్నేహితులు ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు మెస్మరైజ్ అయ్యాడు. వెంటనే ఇద్దరిని హాగ్ చేసుకుని సంబరపడిపోయాడు. 


 





ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ పారాగాన్‌ఫిల్మ్స్ అక్టోబర్ 27న షేర్ చేసింది. ఇప్పటివరకు 39 వేలకు పైగా లైక్‌లు సంపాదించింది. వందలాది మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నాఉ. గత కొన్ని నెలల్లో ఆన్‌లైన్‌లో చూసిన గొప్పదనం ఇదేనని కొందరు అంటున్నారు. నిజమైన స్నేహితులు అంటే వీళ్లే.. గొప్ప స్నేహితులు అంటున్నారు. మరికొందరు పెళ్లికూతరు రియాక్షన్ చూశారా అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్‌ మధ్య  బాండింగ్ ఎంతో బాగుంటే ఇలాంటివి జరుగుతాయని అంటున్నారు. చీరకట్టులో అబ్బాయిలు సూపర్‌గా ఉన్నారని మెచ్చుకుంటున్నారు. 


Also Read: Super Star Krishna Death: మూగవోయిన బుర్రిపాలెం.. సూపర్ స్టార్‌ను గుర్తు చేసుకుంటున్న సొంతూరి ప్రజలు


Also Read: Krishnam Raju wife: కలిసే సినిమాలు చేశారు.. కలిసి చనిపోవాలని అనుకున్నారేమో?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి