Jawan Movie Poster: హెల్మెట్ ధరించకపోతే ఇలానే ఉంటుందంటున్న పోలీసులు
Use Helmet To Avoid Head Injuries Like Jawan Movie Poster: షారుఖ్ ఖాన్ హీరోగా, నయనతార ఫీమేల్ లీడ్, ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి మరో ప్రధాన పాత్రలో కనిపించిన జవాన్ మూవీతో సౌతిండియా దర్శకుల టాలెంట్ ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. కాగా జవాన్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతున్న నేపథ్యంలో ఇదే సినిమా పోస్టర్‌ని ఉపయోగించుకుని ట్రాఫిక్ పోలీసులు సైతం తమ క్రియేటివిటీకి పదునుపెడుతున్నారు.
Use Helmet To Avoid Head Injuries Like Jawan Movie Poster: జవాన్ మూవీ రిలీజై బాక్సాఫీస్ వద్ద బంపర్ కలెక్షన్స్ రాబడుతూ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. షారుఖ్ ఖాన్ హీరోగా, నయనతార ఫీమేల్ లీడ్, ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి మరో ప్రధాన పాత్రలో కనిపించిన జవాన్ మూవీతో సౌతిండియా దర్శకుల టాలెంట్ ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. జవాన్ మూవీని డైరెక్ట్ చేసిన తమిళ దర్శకుడు అట్లీ కుమార్ దక్షిణ భారత్ కి చెందిన దర్శకుల ప్రతిభ ఏంటో యావత్ భారతానికి చూపించి ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ తరహాలో ప్యాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న స్టార్ డైరెక్టర్స్ సరసన చేరాడు.
జవాన్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతున్న నేపథ్యంలో ఇదే సినిమా పోస్టర్‌ని ఉపయోగించుకుని ట్రాఫిక్ పోలీసులు సైతం తమ క్రియేటివిటీకి పదునుపెడుతున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు హెల్మెట్ వినియోగంపై ద్విచక్రవాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తూ సోషల్ మీడియాలో ఓ క్రియేటివ్ పోస్టర్‌ని విడుదల చేశారు.
ఈ పోస్టర్ డిజైన్ కోసం ఉత్తర్ ప్రదేశ్ ట్రాఫిక్ పోలీసులు జవాన్ మూవీలో షారుఖ్ ఖాన్ తలకు భారీ గాయమై కట్లు కట్టుకున్నట్టుగా ఉన్న పోస్టర్‌ని ఉపయోగించుకున్నారు. జవాన్లయినా.. వృద్ధులైనా.. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించకపోతే ఇదిగో ఇలా తయారవుతారని.. ఇలా కాకుండా ఉండాలంటే హెల్మెట్ ఉపయోగించాలి అని యూపీ ట్రాఫిక్ పోలీసులు తమ సోషల్ మీడియా క్యాంపెయిన్‌లో క్యాప్షన్ గా పేర్కొన్నారు. యూపీ ట్రాఫిక్ పోలీసుల క్రియేటివిటీ ఎలా ఉందో మీరే చూడండి.
చూశారు కదా.. యూపీ ట్రాఫిక్ పోలీసుల క్రియేటివిటీ చూసి నెటిజెన్స్ సైతం కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ట్రాఫిక్ పోలీసులకు భలే ఐడియా వచ్చిందే అంటూ కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
ఇలా సినిమా పోస్టర్స్, టీజర్స్, వీడియోలు ఉపయోగించి ట్రాఫిక్ గైడ్ లైన్స్ పై అవగాహన కల్పించడం ఇదేం తొలిసారి కాదు. గతంలో మన హైదరాబాద్ పోలీసులు కూడా ఇలా సోషల్ మీడియా ద్వారా ఎన్నోసార్లు ఆకట్టుకునేలా క్రియేటివ్ పోస్టర్స్ రూపొందించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ముంబై ట్రాఫిక్ పోలీసులు, ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు సైతం వివిధ సందర్భాల్లో ఇలా తమ క్రియేటివిటీకి పదునుపెట్టి జనంలో ట్రాఫిక్ గైడ్ లైన్స్ పై అవగాహన కల్పించిన సందర్భాలు ఉన్నాయి. సినిమా మాధ్యమాలను ఉపయోగించుకుంటే తాము చెప్పాలనుకున్నది జనంలోకి ఈజీగా వెళ్తుంది అనేది వారి అభిప్రాయం. ఒకరకంగా అది నిజం కూడా కదా..