Lion Vs Buffalo Fight : సింహం వేట ఎంత పవర్ఫుల్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కసారి అది ఎటాక్ చేసిందంటే ఏ జంతువుకైనా దాని దాడి నుంచి తప్పించుకోవడం అంత సాధ్యం కాదు. అందుకే హీరోలను సింహాలతో పోల్చే పవర్ఫుల్ డైలాగ్స్ సినిమాల్లో వింటుంటాం.  అయితే ఎంతటి శక్తివంతమైన జీవికైనా.. కొన్నిసార్లు భంగపాటు తప్పకపోవచ్చు. ఈ వీడియో (Lion Vs Buffalo) చూస్తే ఆ మాట నిజమనిపించకమానదు. ఓ దున్నను వేటాడేందుకు ప్రయత్నించిన సింహం దాని చేతిలో చిత్తయిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ వీడియోను (Viral Video) గమనిస్తే... తనపై దాడికి యత్నించిన సింహాన్ని దున్న తన కొమ్ములతో నేలకేసి కొట్టింది. కాలితో ఫుట్‌బాల్‌ను తన్నినట్లు కొమ్ములతో దాన్ని కుమ్మేసింది. ఇంతలో మరో దున్న కూడా దానికి తోడైంది. వాటి కుమ్ముడు ధాటికి ఆ సింహం నేల పైనుంచి పైకి లేవలేకపోయింది. దున్నల దాడికి గేదెకు రక్తస్రావం అవడం వీడియోలో గమనించవచ్చు.


నేచర్ 27 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ అయిన ఈ వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. బహుశా ఆ సింహం ముసలిదేమోనని... వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కింగ్ ఆఫ్ జంగిల్‌గా పిలిచే సింహానికి తిరుగులేదని చాలామంది భావిస్తారు కానీ... అప్పుడప్పుడు ఇలా కూడా జరుగుతుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి సింహానికి చావు భయమంటే ఏంటో ఆ దున్నపోతు చూపించిందని అభిప్రాయపడుతున్నారు.


 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by طبیعت (@nature27_12)


Also Read: 16 ఏళ్లకే రజస్వల అయితే... మహిళల వివాహ వయసు పెంపుపై ఎస్పీ ఎంపీ షాకింగ్ కామెంట్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook