Train Stopped For Kachoris: అప్పట్లో పాకిస్తాన్‌కి చెందిన ఓ లోకో పైలట్ పెరుగు కోసం ఏకంగా రైలునే ఆపిన ఘటన గుర్తుందా.. అచ్చు అలాంటి ఘటనే తాజాగా మన దేశంలోనూ చోటు చేసుకుంది. రాజస్తాన్‌లోని అల్వార్‌లో ఓ లోకో పైలట్ కచోరీ కోసం ట్రైన్‌ను ఆపాడు. నిజానికి సదరు లోకో పైలట్ నిత్యం ఇలాగే చేస్తున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  కచోరీ కోసం అతను ట్రైన్‌ని నిలిపేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజస్తాన్‌ అల్వార్‌లోని దౌడ్‌పూర్‌లో ఉండే ఓ రైల్వే క్రాసింగ్ వద్ద ఆ లోకో పైలట్ రైలును ఆపాడు. అప్పటికే అక్కడ కచోరీ పార్శిల్‌తో ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. కచోరీ కోసమే రైలును ఆపిన ఆ లోకో పైలట్.. పార్శిల్ అందుకోగానే ట్రైన్‌ని మళ్లీ స్టార్ట్ చేశాడు. ఇదేమీ ఒక్కసారి జరిగిన ఘటన కాదని.. సదరు లోకో పైలట్‌కి ఇది నిత్యకృత్యంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతీ రోజూ ఉదయం 8గంటలకు ఆ లోకో పైలట్ దౌడ్‌పూర్ రైల్వే గేట్ వద్ద రైలును ఆపుతాడని.. అప్పటికే కచోరీతో ఓ వ్యక్తి అక్కడ సిద్దంగా ఉంటాడని చెబుతున్నారు. అతని కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని.. రైల్వే గేట్ వద్ద ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు.


సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్లు ఆ లోకో పైలట్ తీరును తప్పు పడుతున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖను డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం జైపూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ దృష్టికి వెళ్లడంతో సదరు లోకో పైలట్‌పై వేటు వేశారు. అతనితో పాటు మరో లోకో పైలట్, ఇద్దరు గేట్‌మెన్లపై కూడా వేటు పడింది. విచారణ తర్వాతే వారిపై వేటు వేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. 



Also Read: Flipkart Smart TV Offers: రూ.23 వేల విలువైన స్మార్ట్ టీవీ.. ఫ్లిప్ కార్ట్ లో రూ.800లకే అందుబాటులో!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook