Snake Creamation: జీవచరాల్లో పాము విషపూరితమైనది. కానీ హిందూవులు పామును దేవతగా పూజిస్తుంటారు. అయినా కూడా పాము కాటు వేస్తుందనే భయంతో దానిని చంపేస్తుంటారు. కానీ ఏపీలోని ఒక గ్రామంలో మాత్రం పామును దైవంగా భావిస్తున్నారు. నాగదేవతగా పిలుచుకునే పాములంటే ఆ గ్రామస్తులకు ఎంతో భక్తి. ఈ క్రమంలో ఓ పాము చనిపోవడంతో గ్రామస్తులు ఆవేదన చెందారు. మనుషులకు చేసిన మాదిరి పాముకు అంత్యక్రియలు చేశారు. పూజలు చేసి.. పాడె కట్టి ఊరేగింపుగా తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం మేళంవారిమెరకలో జరిగింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Student Warn To Teacher: 'సార్‌ మార్కులు వేయకుంటే చేతబడి చేయిస్తా'.. జవాబుపత్రంలో విద్యార్థి వార్నింగ్‌


 


పేరుపాలెం సౌత్‌ పంచాయతీ పరిధిలోని మేళంవారిమెరకలో మంగళవారం తాచుపాము చనిపోయి కనిపించింది. ఇళ్ల పరిసరాల్లో పడి ఉన్న పామును గుర్తించిన గ్రామస్తులు పూజలు చేశారు. ఆ ప్రాంతంలో తాచుపామును దైవంగా భావిస్తుంటారు. పాముకు నీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం కొబ్బరి మట్టను పాడెగా చేశారు. దానిపై పామును ఉంచి పసుపు కుంకుమ వేసి పూజలు చేశారు. పూలు సమర్పించి మొక్కారు.

Also Read: Biryani In Lord Ram Plates: దేవుడా! శ్రీరాముడి ప్లేట్‌లో చికెన్‌ బిర్యానీ.. ఆందోళనలో భక్తులు


 


అనంతరం గ్రామస్తులంతా పాడెపై పామును ఊరేగించారు. ఒకచోట పాముకు దహన సంస్కారాలు నిర్వహించారు. ఇలా చేయడంపై గ్రామస్తులు స్పందించారు. తాచుపామును తాము దేవుడిగా పూజిస్తామని గ్రామస్తులు చెప్పారు. ఇళ్ల మధ్యన చనిపోయి ఉన్న పామును చూసి ఇలా అంత్యక్రియలు చేశామని వివరించారు. కాగా, గతంలో కూడా ఏపీలో ఇలా పాముకు అంత్యక్రియలు నిర్వహించిన విషయం తెలిసిందే.


విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయ పరిసరాల్లో పాము సంచరిస్తే ఇలాగే అంత్యక్రియలు చేపట్టారు. ఆ పాముకు దుర్గ గుడి వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు పాముకు దహన సంస్కారాలు జరిపించారు. ఆధ్యాత్మిక ప్రాంతాల్లో సంచరించే ఏ జీవి చనిపోయినా అంత్యక్రియలు జరిపించడం శాస్త్రమని నాడు వైదిక కమిటీ సభ్యులు చెప్పారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter