Viral Video: ఐదవ ఫ్లోర్ నుంచి జారి పడిన చిన్నారి, సూపర్‌మేన్‌లా దూసుకొచ్చి చిన్నారిని క్యాచ్ పట్టిన వ్యక్తి,
Viral Video: ఒకటి కాదు రెండు కాదు..ఐదు అంతస్థుల నుంచి జారి పడిన చిన్నారి. అంతలో సూపర్‌మ్యాన్‌లా దూసుకొచ్చేశాడు. అద్భుతంగా క్యాచ్ పట్టి ఆ చిన్నారి ప్రాణాలు కాపాడాడు. రియల్ హీరోకు నెటిజన్లు నీరాజనాలు పలుకుతున్నారు.
Viral Video: ఒకటి కాదు రెండు కాదు..ఐదు అంతస్థుల నుంచి జారి పడిన చిన్నారి. అంతలో సూపర్‌మ్యాన్‌లా దూసుకొచ్చేశాడు. అద్భుతంగా క్యాచ్ పట్టి ఆ చిన్నారి ప్రాణాలు కాపాడాడు. రియల్ హీరోకు నెటిజన్లు నీరాజనాలు పలుకుతున్నారు.
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఆశ్చర్యపరిచే వీడియోలు వెలుగుచూస్తుంటాయి. అటువంటిదే ఈ వీడియో. చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే వైరల్ కాసాగింది. ఓ చిన్నారి ఏకంగా ఓ బిల్డింగ్ ఐదవ అంతస్థు నుంచి కిందకు పడిపోతుంది. కానీ ఓ వ్యక్తి సూపర్‌మెన్‌లా దూసుకొచ్చి.ఆ చిన్నారిని పట్టుకుని కాపాడుతాడు. ఈ వీడియో చూస్తే ఎవరికైనా ఒళ్లు జలదరించకమానదు. ఈ ఘటన చైనాలో జరిగింది. సకాలంలో అక్కడున్న ఆ మనిషి స్పందించకపోతే ఆ చిన్నారి ప్రాణాలు పోయేవి.
అక్కడొక పెద్ద బిల్డింగ్. ఆ బిల్డింగ్ ఐదవ అంతస్థు నుంచి ఓ చిన్నారి కిందకు జారిపోతుంది. కిందకు జారి పడిపోతూ ఫస్ట్‌ఫ్లోర్‌పై ఉన్న టెర్రాస్‌పై పడుతుంది. అక్కడి నుంచి కూడా జారి కిందకు పడిపోబోతుంది. అంతలో అక్కడున్న ఓ వ్యక్తి వేగంగా దూసుకొస్తాడు. కింద పడిపోతున్న ఆ చిన్నారిని క్యాచ్ పట్టుకుంటాడు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో షేర్ కాగానే పెద్దఎత్తున వైరల్ అవుతోంది. అందరూ ఆ వ్యక్తిని సూపర్ హీరో అని కీర్తిస్తున్నారు. ఆ వ్యక్తి 31 ఏళ్ల ఝోఝియాంగ్ ప్రాంత నివాసి. అతడి పేరు శేన్ డాంగ్ తోంగ్‌జియాంగ్. అక్కడే స్థానికంగా ఉన్న ఓ బ్యాంకులో పనిచేస్తున్నాడు.
Also read: పాట పాడుతూ ఆవును ఆటపట్టిందామనుకున్న యువకుడు.. చివరికి ఏమైందో చుడండి! నవ్వు ఆపుకోలేరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.