Cock and Hen Viral Video: బీరు తాగిన కోళ్లు, తాగిన మైకంలో గాల్లో ఎగిరెళ్లిన కోడి పుంజు..వీడియో వైరల్
Cock and Hen Viral Video: ప్రపంచం నలుమూలల్నించి సోషల్ మీడియాలో విభిన్నమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే మతిపోతుంది కూడా. అలాంటిదే ఈ వీడియో. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Cock and Hen Viral Video: ప్రపంచం నలుమూలల్నించి సోషల్ మీడియాలో విభిన్నమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే మతిపోతుంది కూడా. అలాంటిదే ఈ వీడియో. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
మందుబాబులకు అత్యంత ప్రియమైనది బీర్. దాహం తీర్చేందుకు, ఎండల్నించి ఉపశమనం పొందేందుకు ఎక్కువమంది బీర్ తాగడాన్ని ఇష్టపడుతుంటారు. కానీ ఇప్పుడు బీర్ అంటే మాక్కూడా ఇష్టమేనంటున్నాయి ఆ కోళ్లు. యజమాని అలా వెళ్లాడో లేదో..ఇలా తాగసి..రివ్వున ఎగిరిపోయాయి. ఆ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.
అక్కడొక బీర్ బాటిల్ ఉంది. పక్కనే గ్లాసులో బీర్ కూడా ఉంది. అప్పటివరకూ తాగుతూ యజమాని అలా బయటికెళ్లినట్టున్నాడు.ఎవరూ లేకపోవడం గమనించి..రెండు కోళ్లు అక్కడికి చేరుకున్నాయి. ఒకటి కోడి అయితే మరొకటి కోడి పుంజు. హాయిగా బీర్ టేస్ట్ చేసి కొద్ది కొద్దిగా తాగాయి. బీర్ తాగిన తరువాత...కోడిపుంజుకు మత్తెక్కినట్టుంది. గాలిలో తేలినట్టుందే పాట గుర్తొచ్చిందేమో..రివ్వున అలా ఎగురుకుంటూ వెళ్లిపోయింది.ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కోళ్లు బీరు తాగడం, కోడిపుంజు గాలిలో ఎగరడం అంతా నిబిడాశ్చర్యానికి గురి చేస్తోంది అందర్నీ. అందుకే ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.
బీరు తాగినంతవరకూ బాగానే ఉంది. తాగిన తరువాత అలా గాల్లో ఎగరడమే నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియోకు పెద్ద ఎత్తున లైక్స్, కామెంట్లు వస్తున్నాయి. అప్పుడే 35 వేలమంది వీక్షించారు. ఈ వీడియోకు మీమ్స్ యాడ్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారు.
Also read: OMG Video: దించకుండా బీర్ కొట్టి.. బాహుబలి గేదెతో పైట్ కు దిగిన మేక.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook