Fish Falls From The Sky During Rain: వాతావరణ మార్పులు, కాలుష్యం కారణంగా.. ఆమ్ల వర్షాలు పడటం చూశా. అదే విధంగా చేపల వర్షం గురించి కూడా విన్నాం. కానీ చూసినవాళ్లు మాత్రం తక్కువనే చెప్పాలి. తాజాగా యూఎస్ (US News) లో చేపల వర్షం కురిసింది. టెక్సాస్‌లో తుపాను కారణంగా కురిసిన వానకు ఆకాశం నుంచి చేపలు పడ్డ వింత సంఘటన చోటుచేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే..


అమెరికాలో టెక్సాస్‌ (Texas) రాష్ట్రంలోని టెక్సర్కానా (Texarkana) నగరంలో చేపల వర్షం (rained fish) కురిసింది. నిజానికి వరదలు వస్తే..నీటిలో రకరకాల జంతువులు కొట్టుకురావడం కామన్. కానీ టెక్సాస్‌లో తుపాను కారణంగా కురిసిన వానకు ఆకాశం నుచి చేపలు పడ్డా వింత సంఘటన జరిగింది. ఈ మేరకు చేపల వర్షం కురిసిందంటూ టెక్సాస్‌ నగరం ఫేస్‌బుక్‌లో ( Facebook ) ఒక ఫోటో కూడా పోస్ట్‌ చేసింది. దీంతో నెటిజన్లు ఒకరేమో "స్వర్గం నుంచి ఉడిపడ్డ చేప" అని మరోకరేమో "డబ్లు వర్షం కూడా పడితే బాగుండును" అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 


Also Reading: Viral Video: నిరాశ్రయుడికి హగ్ ఇచ్చిన కుక్క, దాని ప్రేమ అద్భుతమంటోన్న నెటిజెన్స్


శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..
కొంతమంది వాతావరణ శాస్త్రవేత్తలు ఈ చేపల వానకు సైంటిఫిక్ థియరీ చెబుతున్నారు. వీరి ప్రకారం,  వాతావరణంలోని మార్పుల వల్ల టోర్నడోలు (Tornado) ఏర్పడతాయి. ఈ టోర్నడోలు విపరీతమైన వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి. ఇవి నీటిపై ప్రయాణించే సమయంలో ఆ జలాన్ని అపరమితమైన శక్తితో పైకి లాగుతాయి. చేపలు, కప్పలు వంటి సముద్ర జీవులు కూడా టోర్నడోలతో పాటుగా పైకి ప్రయాణిస్తాయి. కొంచెం సేపు ప్రయాణించిన తర్వాత ఈ టోర్నడోలు బలహీనమవుతాయి. అప్పుడు చేపలు వర్షంతో కలిసి కిందికి పడతాయి. అంతే తప్ప ఆకాశంలో చేపలు ఉండటం, అవి వర్షంతో పాటు పడటం జరగదని శాస్త్రవేత్తలు అంటున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook