Viral News: ఇదెక్కడి విడ్డూరం! ఒక్క నిమ్మకాయ ధర రూ.35 వేలా..!
Viral news: అవును.. మీరు విన్నది నిజమే. వేసవి కాలంలో నిమ్మకాయల ధరలు పెరగడం కామన్. మరి ఈ రేంజ్ లోనా. అసలు విషయం తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే.
Viral news in Telugu: మనం రోజువారీ జీవితంలో నిమ్మకాయలు తరుచూ వాడుతుంటాం. నిమ్మకాయతో బోలెడు ప్రయోజనాలు ఉండటంతో దీనిని ఆహారంలో భాగంగా తీసుకుంటాం. కరోనా వచ్చినప్పటి నుంచి నిమ్మ కాయలు వాడకం బాగా పెరిగింది. దీంతో వీటి ధరలకు రెక్కలొస్తున్నాయి. వేసవి కాలంలో నిమ్మకాయల ధరలు పెరగడం సర్వసాధారణం. మహా అయితే పదో పాతికో పెరుగుతుంది, కానీ వేలల్లో పెరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే..
ఇరోడ్ జిల్లా శివగిరి గ్రామ సమీపంలోని పాతపూసయ్య ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి నిమ్మకాయలు, పండ్లతో రెండ్రోజుల పాటు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. అనంతరం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం ప్రకారం, పూజ సామాగ్రిని వేలం వేస్తారు. తాజాగా జరిగిన వేలంలో 15 వేల మంది భక్తులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇరోడ్‌కి చెందిన ఓ భక్తుడు నిమ్మకాయను వేలంపాటలో రూ.35 వేలకు దక్కించుకున్నాడు. ఇతడికి వెర్రా..పిచ్చా..నిమ్మకాయ అంత రేటు కొనడమేంటని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. దేవతారాధాన చేసిన పూజా సామాగ్రిని కొనుగోలు చేసినవారు ధనవంతులు అవుతారని ఇక్కడి భక్తుల విశ్వాసం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
Also Read: Viral Video today: దేశంలో ఇలాంటి వారు ఇంకా ఉన్నారా? కంటతడి పెట్టిస్తున్న చిన్నారి వీడియో..
Also Read: Viral Video today: ఈ బుజ్జి ఏనుగుకు ముందే వచ్చేసిన హోలీ.. ఎలా ఆడుతుందో చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook