Viral News: ఇజ్జత్ తీశావ్ కదారా నాయన.. ప్లేట్ పావ్ భాజీ కోసం దేన్ని చోరీచేశాడో తెలిస్తే షాక్ అవుతారు..
Goa Crime News: ఢిల్లీకి చెందిన కార్తీకేయ రాయ్ అనే వ్యక్తి గోవా కు సరదాగా గడపటానికి వెళ్లాడు. అప్పుడు అతనికి ఊహించిన ట్విస్ట్ ఎదురైంది. అతగాడు ఫుల్ గా తాగడంలో బిజీగా ఉన్నాడు. కానీ ఇంతలో ఒక వ్యక్తి అతని కాస్లీ ఫోన్ ను చోరీ చేశారు. ఈ ఘటనలో బిగ్ ట్విస్ట్ ఉంది..
Goa Man Stolen Iphone For Pav Bhaji: నార్మల్ గా కొందరు కేటుగాళ్లు కాస్లీ మొబైల్ ఫోన్ లే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతుంటారు. ఖాళీగా ఉంటూ లగ్జరీలైఫ్ కు అలవాటు పడి ఇలాంటి తప్పులు పనులు చేస్తుంటారు. ముఖ్యంగా వీరు.. రద్దీగా ఉండే బస్టాండ్ లు, రైల్వే స్టేషన్ లు, వైన్ షాపులలో ఎక్కువగా ఉంటారు. ఇలాంటి ప్రదేశాలలో చోరీలు చేసే వారు కాచుకుని ఉంటారు. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయిన కూడా వెంటనే చోరీలు చేస్తుంటారు. ఇలాంటి క్రమంలో చోరీలు చేసిన కాస్లీ ఫోన్ లను వెంటనే స్విచ్ ఆఫ్ చేస్తారు. ఆతర్వాత పార్ట్ లుగా డివైడ్ చేసి, ఇతర స్టోర్ లలో అమ్మేస్తుంటారు.
Read More: Viral Video: చేప ప్రాణాలను కాపాడిన కొంగ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన..
మరికొందరు సెకండ్ సెల్ షాపులలో విక్రయిస్తారు. దీంతో వచ్చిన డబ్బులతో కొందరు తాగుతుంటారు. ఇంకొందరు..డబ్బులు అయిపోయేవరకు డబ్బులను వెస్ట్ గా ఖర్చులు చేస్తారు. కానీ కొందరు ఆకలిని భరించలేక, చేయడానికి జాబ్ లు లేక చోరీలు చేస్తుంటారు. వీరికి కనీసం చోరీ చేసిన దాని విలువ కూడా తెలుసుండదు. కానీ కేవలం ఆకలిబాధ భరించలేక ఇలాంటి పనులు చేస్తారు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఒక ఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..
ఢిల్లీకి చెందిన కార్తీ కేయ్ రాయ్ అనే వ్యక్తి గోవాకు సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్లాడు. అప్పుడు అతగాడికి ఒక షాకింగ్ అనుభవం ఎదురైంది. అతను ఒక మందు షాఫులో ఫుల్ గా మందుకొడుతున్నాడు. అతని జేబులో కాస్లీ ఐఫోన్ కూడా ఉంది. కానీ అతను ఫుల్ గా తాగి ఉండటం వల్ల, అతను కనీసం నడవలేక దొర్లుతున్నాడు. కానీ.. ఒక కేటుగాడు మాత్రం ఇతగాడిని గమనిస్తున్నాడు. ఇతను పూర్తిగా మత్తులోకి జారుకున్నాక.. మెల్లగా అతని దగ్గరున్న కాస్లీ ఐఫోన్ ను చోరీ చేశాడు. కాసేపటికి నిద్ర నుంచి మెల్కొన్నక సదరు వ్యక్తి తన ఫోన్ ను కన్పించకపోవడంతో చాలా వెతికాడు.
చివరకు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా.. కార్తీ కేయ్ రాయ్ వ్యక్తి మాత్రం తన ఫోన్ కోసం అనేక టెక్నాలజీ పద్ధతులతో ట్రై చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఐఫోన్ ను చోరీ చేసిన వ్యక్తి అక్కడి నుంచి మరోక చోటికి వెళ్లాడు. అంతే కాకుండా.. ఆకలిగా ఉండటంతో పావ్ భాజీ తినాలనుకున్నాడు. కానీ అతని దగ్గర మాత్రం పావ్ భాజీ తినడానికి మాత్రం డబ్బులు లేవు. దీంతో షాపు దగ్గరకు వెళ్లి తన దగ్గర ఐఫోన్ ఉందని, అది తీసుకుని పావ్ భాజీ ఇవ్వాలని బేరంపెట్టాడు. అప్పుడు ఇది గమనించిన షాపు యజమానికి, ఫోన్ స్విచ్ ఆన్ చేశాడు.
Read More: BackPain: నడుము నొప్పితో బాధపడుతున్నారా..?.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..
వెంటనే అతని ఫోన్ మోగడం ప్రారంభమైంది. ఫోన్ ఎత్తగానే.. అవతలి నుంచి సదరు ఫోన్ బాధితుడు తన గురించి చెప్పుకున్నాడు. ఆ ఐఫోన్ తనదని, కొన్నిరోజుల క్రితం తన ఫోన్ పోయిందని చెప్పాడు. వెంటనే అలర్ట్ అయిన దుకాణాదారు బాధితుడికి సమాచారం ఇచ్చాడు. కేవలం కొన్ని గంటల వ్యవధిలో బాధితుడు.. పావ్ భాజీ షాప్ దగ్గరకు చేరుకుని తన ఫోన్ ను తిరిగి తీసుకున్నాడు. ఫోన్ ను విక్రయించిన వ్యక్తి మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పనిగా సమాచారం. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter