ఒక్క నాగు పాము పడగ విప్పితే చూడాలంటేనే గుండె జలదరిస్తుంది.. కొందరికి వెన్నులోంచి వణుకు పుడుతుంది. అలాంటిది ఈ ఫోటోలో ఏకంగా మూడు పాములు పడగవిప్పి చూస్తున్నాయి. అది కూడా ఒకే దిశలో కూడబలుక్కున్నట్టుగా పడగవిప్పి కూర్చున్నాయి. ఒక చెట్టు మొదలును అల్లుకుని పడగ విప్పిన ఈ మూడు పాములు సింగిల్ ఫ్రేమ్‌లో బంధీ అవడంతో ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా హరిసల్ అడవుల్లో ఈ ఫోటో కెమెరాకు చిక్కింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనావాసాల్లోకి ప్రవేశించిన పాములను పట్టుకుని సురక్షితంగా అడవిలో వదిలిన అనంతరం అవి ఇలా పడగ విప్పి చూస్తున్నప్పుడు ఈ ఫోటోను క్లిక్ మనిపించినట్టు వార్తలొస్తున్నాయి. రాజేంద్ర సెమాల్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫోటోకు దాదాపు 5 వేల మంది యూజర్స్ లైక్ చేశారు. 


సోషల్ మీడియాలో రాజేంద్ర పోస్ట్ చేసిన ఫోటోల్లోని ఓ ఫోటోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద.. ఒకేసారి నిన్ను మూడు పాములు ఆశీర్వదించాయనే అర్థంతో క్యాప్షన్ పెట్టి రాజేంద్రకు ఫోటో క్రెడిట్ ఇచ్చారు. 



Also read : ఆరోగ్యం కోసం ఆవు పేడ తింటున్న డాక్టర్ వీడియో వైరల్.. నెటిజెన్స్ ఏమంటున్నారంటే..


సుశాంత నంద ఫోటోను చూసి నెటిజెన్స్ భారీ సంఖ్యలో స్పందిస్తున్నారు. ఒక ట్విటర్ యూజర్ స్పందిస్తూ.. దూరం నుంచి చూడ్డానికి అందంగా ఉంటుంది కానీ దగ్గరికి వెళ్తే భయంతో చమటలు పడతాయని తన కామెంట్‌లో పేర్కొన్నాడు. 



మరొక ట్విటర్ యూజర్ స్పందిస్తూ.. అవి అలా కనిపించిన మరుక్షణమే అక్కడి నుంచి తుర్రుమనేవాడినని ఫన్నీ కామెంట్ పోస్ట్ చేశాడు.



Also read : వైరల్ వీడియో: పారాసైలింగ్ చేస్తుండగా తాడు తెగి గాల్లోంచి సముద్రంలో పడిన జంట


Also read : Man praying god before stealing hundi: హుండి ఎత్తుకెళ్లడానికొచ్చి ఏం చేశాడో చూడండి.. వైరల్ వీడియో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook