Chilli potato making video: వయస్సు 13 ఏళ్లే.. కానీ చేసేది మాత్రం పెద్ద పనే. ఒకవైపు తన చదువును కొనసాగిస్తూనే.. మరోవైపు ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం చేసుకుంటున్న తల్లిదండ్రులకు సాయంత్రం నుంచి రాత్రి పడుకునే వరకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని పనుల్లో వారికి సాయంగా ఉంటున్నాడు. తల్లిదండ్రులకు సాయంగా ఉంటున్నాడంటే ఏదో చిన్న చిన్న పనులు చేస్తున్నాడని అనుకోవద్దు సుమీ!! అలా అనుకుంటే మీరు పొరపడినట్టే. 13 ఏళ్ల చిరు ప్రాయంలో అతడు చేసే పనులు చూస్తే.. మీరు అవాక్కవడం ఖాయం. ఆ బుడ్డోడిలో అంతగా ప్రత్యేకత ఏముంది అని అనుకుంటున్నారా ? అయితే ఇదిగో ఈ వీడియో చూడండి. అతడి సీన్ ఏంటో మీకే అర్థం అవుద్ది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చూసే వాళ్ల చేత, నెటిజెన్స్ చేత మాస్టర్ చెఫ్ అనిపించుకుంటున్న ఈ బుడతడి పేరు దీపేష్... ఫరిదాబాద్‌లోని ఎన్ఐటి 5 మార్కెట్‌లో దీపేష్ తల్లిదండ్రులు వీది పక్కన ఓ చిన్న ఫాస్ట్ ఫుడ్ స్టోర్ (Fast food business) పెట్టి చిరు వ్యాపారం చేసుకుంటున్నారు. ఉదయం బడికి వెళ్లే దీపేష్ సాయంత్రం స్కూల్ నుంచి రాగానే మార్కెట్‌లో ఉండే తమ దుకాణం వద్దకు చేరుకుంటాడు. అక్కడే రాత్రి 8-9 గంటల వరకు ఉండి తన వంతు సాయం చేస్తాడు. 



Also read : Chicken crying video goes viral : వైరల్ వీడియో : కోసుకుని తింటారేమోనని ఏడ్చేస్తోన్న కోడి


చిల్లి పొటాటో, ఫ్రెంచ్ ఫ్రైస్ మేకింగ్‌లో (Chilli potato / french fries) దీపేష్ ఎక్స్‌పర్ట్. అందుకే ఆ పని తనే చూసుకుంటాడు. స్కూల్ నుంచి రాగానే అప్పటికే అమ్మ రెడీ చేసిన వేడి వేడి స్నాక్స్ తిని స్నేహితులతో ఆడుకునే వయస్సు అతడిది. అంత చిన్న వయస్సులో ఉండే పిల్లలో చాలా మంది చేసేది అదే పని. కానీ తన జీవితం చాలా మంది చిన్న పిల్లల్లా వడ్డించిన విస్తరి కాదు అనే నగ్న సత్యాన్ని ఒంటబట్టించుకున్న దీపేష్.. ఇలా అమ్మా, నాన్నలకు సహాయం చేస్తూ అందులోనే ఆనందం వెదుక్కుంటున్నాడు.


దీపేష్ కుకింగ్ స్కిల్స్ గురించి తెలుసుకున్న ఫుడీ విశాల్ అనే ఫుడ్ వ్లాగర్ (Foody Vishal) అతడి వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ (Fast food cooking videos) అవడంతో దీపేష్ గురించి తెలుసుకున్న వాళ్లంతా అతడిని అభినందించకుండా ఉండలేకపోతున్నారు. మనం ఏదైనా చేయగలం అనే కాన్ఫిడెన్స్ ఉంటే.. అసాధ్యం కానిది అంటూ ఏదీ లేదని దీపేష్ నిరూపిస్తున్నాడని కొంతమంది అభినందిస్తే.. ఆత్మవిశ్వాసంతో (Confidence levels) ముందడుగేస్తే.. ప్రపంచం నీ ముందు తల వంచి సలాం కొడుతుందని ఇంకొందరు దీపేష్‌ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. అంతే కదా మరి.. అవసరం, పరిస్థితులు ఏమైనా చేయిస్తాయి. ఎంతటి కష్టాన్నయినా భరించేలా చేస్తాయి. చిన్న వయస్సులోనే ఎనలేని ఆత్మవిశ్వాసంతో (How to build self-confidence) కష్టాలను ఎదురీదుతున్న దీపేష్‌ లాంటి కుర్రాళ్ల ముందు ఏదైనా తలవంచాల్సిందే అని అనిపిస్తోంది కదూ!!


Also read : Man jumps into lion enclosure: సింహం నోట్లో తల పెట్టడం అంటే ఇదే.. Viral video


Also read : Tomato Price Increased: 20 రోజుల్లో లక్షాధికారిని చేసిన టమోటా.. ఇప్పటి వరకు రూ. 80 లక్షలపైనే సంపాదించిన రైతు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook