Viral Video: A Crocodile Rescued by Vadodara Wildlife Rescuers: సాధారణంగా పాము కనిపిస్తే.. పాము పాము అంటూ గట్టిగా అరుస్తూ పరుగులు పెడుతుంటాం. వాస్తవానికి తనకు ఏమైనా హాని చేస్తారేమోనని ఆ పాములు సైతం భయపడతాయి. అయితే కొన్ని గ్రామాల్లో మొసళ్లు తిరుగుతూ స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గుజరాత్‌లోని వడోదరలో నేటి ఉదయం ఇలాంటి ఘటనే జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


వడోదరలోని విరోద్ గ్రామంలోకి ఓ మొసలి వచ్చింది. ఆపై అది తాపీగా పోలాల్లోకి వెళ్లింది. మొసలి తిరుగుతుందని ఆందోళన చెందిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే అక్కడికి వెళ్లిన అధికారులు తమ తెలివి తేటలతో సులువుగానే మొసలి(Crocodile)ని పట్టుకున్నారు. కానీ అక్కడే వారికి సమస్య ఎదురైంది.


Also Read: WhatsApp: ప్రైవసీ పాలసీ నచ్చలేదా.. మీ వాట్సాప్ అకౌంట్ ఇలా డిలీట్ చేసుకోండి 


 



 


పట్టుకున్న మొసలిని బోనులో బంధించేందుకు అధికారులు ఆపసోపాలు పడ్డారు. వాస్తవానికి ఇతర జంతువులు అయితే మత్తు ఇంజక్షన్ ఇచ్చి.. లేక ఏదో విధంగా బంధిస్తారు. అయితే పట్టుకున్న మొసలిని బోనులోకి తీసుకెళ్లేందుకు వడోదర అటవీశాఖ అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. 


Also Read: COVID-19 Vaccine తీసుకున్నవారిలో ఏ లక్షణాలు కనిపిస్తాయంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook