Hair Cut in Space: అంతరిక్షంలో హెయిర్ కటింగ్, వీడియో వైరల్
Viral Video: మనం సాధారణంగా రకరకాల సెలూన్ లు చూసుంటాం. అంతరిక్షంలో సెలూన్ ఎప్పుడైనా చూశారా..పదండి చూసేద్దాం.
Viral Video: మానవుడు తన మేథస్సుతో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. టెక్నాలజీని అందిపుచ్చుకుని అవని నుంచి అంతరిక్షం వరకు యాత్రలు నిర్వహిస్తున్నాడు. విశ్వం పుట్టుక గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. చంద్రుడి గురించి పరిశోధిస్తున్నాడు. సూర్యుడిని అధ్యయనం చేస్తున్నాడు. ఆధునిక సాంకేతికతో భూమికి, అంతరిక్షానికి మధ్య దూరం తగ్గించేశాడు. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ (Space Station) నెలకొల్పి..రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు.
అయితే ఇటీవల స్పేస్ స్టేషన్ లో నాసా వ్యోమగామి రాజా చారి తోటి వ్యోమగామి మథియాస్ మౌరర్ (Astronaut Matthias Maurer)కు హెయిర్ కట్ (Hair Cut) చేస్తున్న వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో మౌరర్ జుట్టును ట్రిమ్మర్‌తో రాజా చారి ((Astronaut Raja) కత్తిరించాడు.
Also Read: Black Idli: బొగ్గులు కావివి.. బ్లాక్ ఇడ్లీలు! తెలుగోడి క్రియేటివిటీకి ఫిదా అవుతున్న జనాలు..!
''స్పేస్ సెలూన్ లోకి రండి. ప్రతిభ ఉన్న బార్బర్ ఆస్ట్రో రాజా ఉన్నారు. ఎందుకంటే వ్యోమగాముల కళ్లలో జుట్టు ఉంచుకోవడానికి ఇష్టపడరు. ఈ స్పేస్ స్టైలిస్ట్ సర్వీస్ కు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వాలి'' అని మౌరర్ ట్విట్టర్ (Twitter) లో రాసుకొచ్చారు. డిసెంబర్ 19న షేర్ చేసిన వీడియోకి ఇప్పటి వరకు 29,000 వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ సంవత్సరం ఆగస్టులో ఫ్రెంచ్ వ్యోమగామి థామస్ పెస్క్వెట్ వ్యోమనౌకలో తోటి ఆస్ట్రోనాట్స్ తో కలిసి పిజ్జాను ఆస్వాదిస్తున్న క్లిప్‌ను పోస్ట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook