Mehendi Night Bride Groom Viral Video: పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురు అందంగా ముస్తాబు కావడం చూసి షాక్ అయ్యే వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వరుడు, వధువు కలుసుకునే ఈ వీడియో నెటిజన్లకు బాగా నచ్చింది. మెహందీ నైట్ రోజుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను @wedding_fairs ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు.
 
వరుడు రిషి.. వధువు సౌమ్య వర్మ రెడీ అవుతోన్న రూమ్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. ఇక సౌమ్యని చూడగానే మనోడు అబ్బా ఇంత అందంగా తయారయ్యావ్‌ అన్నట్లుగా లుక్ ఇస్తాడు. ఆమెను చూడగానే తన మనస్సులో కలిగిన సంతోషాన్ని అంతా వ్యక్తం చేస్తాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక వధువు సౌమ్య క్రీమ్ కలర్ గౌన్ డ్రెస్‌లో రెడీ అయి ఉండడం వీడియోలో చూడొచ్చు. ఆమెను చూడగానే పెళ్లి కొడుకు రిషి దగ్గరకు తీసుకుని చేతులపై ముద్దు పెట్టుకుంటాడు. ఆ తర్వాత తన డ్రీమ్ గర్ల్‌ బుగ్గలపై కూడా ఆప్యాయంగా ముద్దు పెట్టుకోవాలనుకుంటాడు కానీ ఎక్కడ ఆమె మేకప్‌ పోతుందోనని.. ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు.



 


పెళ్లి కూతురిని చూసి పెళ్లి కొడుకు ఇచ్చిన ఎక్స్‌ప్రెషెన్స్‌ నెటిజన్స్‌కు ఎంతో నచ్చాయి. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ వీడియో ఇప్పటికే 32,000 కంటే ఎక్కువ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. దాదాపు 2,000 పైగా ఈ వీడియోకు లైక్‌లు వచ్చాయి. ఇక ఈ వీడియోలో ఉన్న జంటను మెచ్చుకుంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.


Also Read: Viral Video: ఈ ఛాన్స్ పోతే మళ్లీ రాదన్నట్టు స్టెప్పేసిన నవ వధువు.. చూస్తే షాకే!!


Also Read: Deepika Padukone Photos: షర్ట్ లో మెస్మరైజ్ చేస్తున్న సొట్టబుగ్గల సుందరి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook