Viral Video: ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకోండ్రా.. ఆవు నేర్పిన పాఠం.. వాడికి మాత్రం గుణపాఠం!
మానవత్వం మంట కలుస్తున్న ఈ తరుణంలో.. ఒక ఆవు చేసిన పని అందరికి కళ్లు తెరిపిస్తుంది. మూగ జీవుల పట్ల అమానుషంగా వ్యవహారించే వారికి ఇదొక కర్మ ఫలం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఆ వైరల్ వీడియో మీరే ఒకసారి చూసేయండి .
Cow Attacking on Men Who Harassing Dog: మనుషుల్లో కొందరు మృగాళ్ల వ్యహరిస్తుంటారు. అభం శుభం తెలియని మూగజీవాలని రాళ్లతో, కర్రలతో దాడి చేస్తూ పైశాచికంగా ఆనందం పొందుతారు. కొన్ని సార్లు పక్కన ఉన్న వారు చెప్పినా వినిపించుకోకుండా నీచంగా వ్యవహారిస్తుంటారు. ఇలాంటి వీడియోలు ఇప్పటికే మనం చాలా చూసి ఉంటాము. అయితే ఇపుడు చూసే వీడియో చాలా ప్రత్యేకమైనది.... ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి పోస్ట్ చేశారు.
ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతుంది.. ఒక మూగ జీవి ఇంకో మూగజీవాన్ని కాపాడటం మనం చాలా వీడియోల్లో చూసాము. కానీ మనిషి చేతిలో హింసకు గురవుతున్న ఒక శునకాన్ని ఒక ఆవు కాపాడిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఒక మూర్ఖుడు రోడ్డుపై ఉండే కుక్కను హింసిస్తున్నాడు.. దాని చెవులని పట్టుకొని పైకి లాగుతూ హింసిస్తున్న తీరు వీడియోలో మనం చూడవచ్చు. బాధతో నోరులేని ఆ ముగా జీవం అరవటం కూడా మనం గమనించవచ్చు.
Also Read: Bigg Boss Nominations: రసవత్తరంగా నామినేషన్ ప్రక్రియ.. హీటెక్కిన బిగ్‌బాస్ హౌస్
ఆ వ్యక్తి అలా చేస్తుంటే చుట్టూ ఉన్న వారిలో ఒక్కరు కూడా వద్దు అని చెప్పక పోవటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కానీ బాధతో కుక్క అరుస్తున్న అరుపులు విన్న ఆవు పరిగెత్తుకు వచ్చి కొమ్ములతో ఆ వ్యక్తిని కింద పడేసి నిలువరించి శునకాన్ని కాపాడటం మనం చూడవచ్చు. ఆవు రెండు కొమ్ములతో ఆ వ్యక్తిని పైకి లేపి కింద పడేసి అతడిని గాయపరిచింది.
మానవత్వం లేని మనుషులు ఈ వీడియో చూసి చాలా నేర్చుకోవాలి.. కర్మ ఫలం అనుభవించక తప్పదంటూ అటవీ శాఖ అధికారి సుషాంత్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసాడు.. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది
Also Read: AP State Formation Day: తెలుగులో ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
"మనుషులకన్నా మూగజీవాలు నయం", "కర్మఫలం అనుభవించాల్సిందే".. "నోరులేని శునకాన్ని హింసించటానికి చేతులు ఎలా వచ్చాయి.." "ఒక మూగజీవి బాధ మరో మూగ జీవికే అర్థం అవుతుంది" అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి