Viral Video: Dog Gives Hug Heartwarming Footage Shows Dog Hugging A Homeless Man Watch the video: కుక్కలు విశ్వాసానికి మారుపేరుగా ఉంటాయి. అందుకే చాలా మంది కుక్కల్ని పెంచుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు. శునకాలకు ముద్దు పేర్లు పెట్టుకుని.. వాటిని ఎంతో ప్రేమగా ఇంట్లో వ్యక్తిలా పెంచుకుంటూ ఉంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుక్కలు (Dogs) కూడా తమ యజమానులపై అమితమైన విశ్వాసాన్ని చూపిస్తుంటాయి. అయితే ఒక శునకం.. రోడ్డుపై నిరాశ్రయంగా ఉన్న వ్యక్తి విషయంలో చూపిన ప్రేమ అద్భుతం. అందుకు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో బస్టాండ్‌ పక్కన ఉండే ప్లాట్‌ఫామ్‌లో కూర్కొన్న వృద్ధుడి (Old man) దగ్గరకు ఒక కుక్క వస్తుంది. కొద్ది సేపు అతని ముందు కూర్చుని ఆప్యాయంగా తోడ ఆడిస్తూ ఉంటుంది. 


దాంతో ఆయన ఆ కుక్కను ప్రేమగా దగ్గరకు తీసుకుని హత్తుకుంటాడు. తన యజమానితో ఎంత ప్రేమగా ఉంటుందో అంతకంటే రెట్టింపు ప్రేమతో ఆ వృద్ధుడి ఒళ్లోకి వెళ్లి కూర్చుంటుంది ఆ శునకం. ఆయన కూడా ప్రేమగా దాని తల నిమురుతూ ఉంటాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ఈ వీడియోను (Video) బ్యూటెంగేబిడెన్ (Buitengebieden) అనే హ్యాండిల్‌ ద్వారా సోషల్ మీడియా షేర్ అయింది.


Also Read : Bus Ticket For Chick: కోడిపిల్లకు బస్సులో రూ.50 టికెట్.. ఆర్టీసీ కండెక్టర్ ఘనకార్యం


ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో (Social media) వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజెన్స్ కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. నోరులేని మూగ జీవాలకు మనుషులపై ఎంతో ప్రేమ ఉంటుంది అనడానికి ఈ వీడియోనే (Video) సాక్ష్యమంటూ కామెంట్స్ చేస్తున్నారు.





 


Also Read : Lionel Messi: ఫుట్​బాల్ స్టార్ లియోనాల్​ మెస్సీకి కరోనా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి