Fat Man Struggling to Do Crunches and Pushups: రెగ్యులర్ వ్యాయామాలు రోగనిరోధక వ్యవస్థను పెంచడమే కాకుండా.. ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తాయి. నిత్యం వ్యాయామం చేస్తే మనకు మంచి ఆరోగ్యం చేకూరుతుంది. మొదడు చురుగ్గా పనిచేయాలన్నా, ఒత్తిడికి దూరంగా ఉండాలన్నా, గుండె జబ్బులను నివారించాలన్నా, రక్తపోటు నియంత్రణలో ఉండాలన్నా, ఇమ్యునిటీ పవర్ పెరగాలన్నా, బరువు తగ్గాలన్నా వ్యాయామం చేయాల్సిందే. అయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది  వ్యాయామంకు దూరంగా ఉంటున్నారు. మరికొందరు ప్రాథమిక వ్యాయామాలు చేయడంలో కూడా విఫలమవుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏదైనా వ్యాయామం చేయడం మొదలెట్టినపుడు మొదట కష్టంగా అనిపిస్తుంది. వ్యాయామం నేర్చుకునే సమయంలో ఒక్కోసారి ఫన్నీ సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లావుగా ఉన్న ఓ వ్యక్తి స్ట్రీట్ రోడ్డుపై వ్యాయామం చేసేందుకు వస్తాడు. అతడి పొట్ట లావుగా ఉన్న కారణంగా.. దాన్ని తగ్గించుకుందుకు క్రంచెస్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ వ్యక్తి కూర్చునే బండపై పడుకుని కాళ్లు, చేతులు కిందికిపైకి అంటాడు. కాళ్లు పైకి అనగానే బ్యాలెన్స్ తప్పిన అతడు దానిపై నుంచి కిందపడిపోతాడు. 



కిందపడిన కూడా అతడు పైకి లేచి ఈసారి పుషప్‌లు చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇందుకు సంబందించిన వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. 'ప్రారంభం ఎలా ఉన్నా.. ముగింపు మాత్రం అద్భుతంగా ఉండాలి. శుభోదయం' అని పేర్కొన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చుసిన అందరూ తెగ నవ్వుకుంటున్నారు. కొందరు మాత్రం అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. 'విఫలమైనప్పటికీ ఎల్లప్పుడూ ప్రయత్నించండి', 'ఫిట్‌గా ఉండటానికి ఎక్సర్‌సైజ్‌ చేస్తున్న ఈ వ్యక్తి అంకితభావాన్ని నేను అభినందిస్తాను' అని కామెంట్లు చేస్తున్నారు. 


Also Read: Hit 2 Release Date: హిట్ 2 సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడో తెలుసా?


Also Read: Nagarjuna Look: అరరే.. నాగార్జునకు ఏమైంది! కింగ్ అలా మారిపోయాడేంటి?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook