Viral Video Funny Selfie: ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తూనే ఉన్నారు. మొబైల్ ధ్యాసలో పడి ప్రపంచాన్నే మర్చిపోతున్నారు. సోషల్ మీడియాల ట్రెండ్ తో పాటు మొబైల్ యూజర్స్ ఇప్పుడు సెల్ఫీల పిచ్చితో ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలకు పోజులిస్తున్నారు. అలా అసందర్భంగా సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో. ఇలాంటి జరుగుతున్నా.. తమ బుద్ధి మార్చుకునే ప్రసక్తే లేదనే విధంగా కొందరి ప్రవర్తన ఉంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ సెల్ఫీలు తీసే మాదిరిగా కొందరు యువకులు మారారు. అయితే మరికొందరు సెల్ఫీ పేరుతో నవ్వుల పాలవుతున్నారు. అలాంటి ఓ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదెదో సినిమాలో చూసినట్లు అందంగా ముస్తాబై బయటకు వచ్చిన హీరోయిన్.. చివరకు బురదలో పడినట్లు ఉంది ఈ వీడియో. సరిగ్గా అదే ఈ వీడియోలోనూ అదే జరగడం సహా వీక్షకులకు నవ్వు తెప్పించే విధంగా ఉంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో చూద్దాం.



వీడియోలో ఏముంది?


బ్లూ కలర్ మోడరన్ డ్రస్ లో అందంగా తయారు అయ్యి బయటకు వచ్చింది ఓ యువతి. అయితే ఆమె తన అందాన్ని కెమెరాలో బంధించాలని అనుకొని.. మొబైల్ లో సెల్ఫీ దిగబోయింది. అయితే ఆమె ఓ కాలువ ఒడ్డున నిల్చొని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే సెల్ఫీ తీసుకునే కంగారులో ఆమె ఆ కాలువలో పడిపోయింది. ఆమె బురద కాలువలో పడడం ఓ వ్యక్తి వీడియో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పుడది వైరల్ గా మారింది.


ఆ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఆమెపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు వేలాది వ్యూస్ తో పాటు లైక్స్ వచ్చాయి. ఇంతకీ ఆ ఫన్నీ వీడియో ఎలా ఉందో మీరే చూడండి.


Also Read: Birthday cake viral video: బర్త్ డే కేక్ కట్ చేయబోతే.. జుట్టుకు నిప్పంటుకున్న వీడియో


Also Read: Scary Video: చెమటలు పట్టిస్తున్న వీడియో..వ్యక్తిపైకి కింగ్ కోబ్రా ఎలా ఎగబడుతుందో చూడండి! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook