Delhi Metro Viral Video: బికినీ ధరించి మెట్రోలో యువతి ప్రయాణం.. నెట్టింట వీడియో వైరల్
Bikini Girl Travelling In Delhi Metro: ఢిల్లీ మెట్రో ట్రైన్లో ఓ యువతి డ్రెస్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బికినీ ధరించి యువతి మెట్రోలో ప్రయాణించింది. బ్యాగు అడ్డుగా పెట్టుకుని యువతి కూర్చొగా.. ఆమె సీటు నుంచి లేచి వెళ్లిపోయే సమయంలో ఎవరో వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.
Bikini Girl Travelling In Delhi Metro: ప్రస్తుతం ఇంటర్‌నెట్ యుగంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో నెట్టింట వీడియో వైరల్ అవుతున్నాయి. కాస్త వైరెటీగా.. డిఫరెంట్‌గా కనిపిస్తే చాలు నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ మెట్రోలో ఓ అమ్మాయి టూ పీస్ డ్రెస్ ధరించి ప్రయాణించింది. బికినీ తరహాలో ఉన్న డ్రెస్ ఉండగా.. నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాల కామెంట్స్‌తో ట్రోల్ చేస్తున్నారు.
ఢిల్లీ మెట్రోలో ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. రద్దీగా ఉన్న ఢిల్లీ మెట్రోలో ఒక్కోసారి నిలబడేందుకు కూడా ప్లేస్ ఉండదు. ఇంతటి రద్దీ మెట్రోలో ఓ అమ్మాయి బికినీ ధరించి ప్రయాణించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె టూ పీస్ డ్రెస్ ధరించి.. ఓ బ్యాగ్ తీసుకుని ప్రయణిస్తోంది. తన స్టేషన్ రాగానే దిగిపోయే సమయంలో ఎవరో వీడియో తీసి నెట్టింట పోస్ట్ పెట్టారు. అయితే ఈ వీడియో ఎప్పుడు బయటకు వచ్చిందో కచ్చితంగా తెలియరాలేదు. యువతి ఎవరనేది కూడా తెలియలేదు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఈ అమ్మాయిలాగా మగవాళ్లు కూడా తక్కువ బట్టలు వేసుకుని ప్రయాణం చేయవచ్చా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కొందరు యూజర్లు డిమాండ్ చేస్తున్నారు.
'ఇది మహిళా సాధికారతకు ఉదాహరణ అయితే.. అయ్యో.. మన యువతరం అమ్మాయిలు అలాంటి సాధికారతకు బాధితులు కావచ్చు. సిగ్గులేని స్త్రీవాదులు కోరుకునేది ఇదే..' అంటూ ఒక వినియోగదారు ఘాటుగా రాస్తూ.. వీడియోను పోస్ట్ చేశారు. 'నేను దానిని సాంస్కృతిక మారణహోమం అంటాను..' అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. 'ఇదంతా స్వేచ్ఛ, ఆధునికత పేరుతో ఇలా.. మనం ఏమి చెప్పగలం. నాకు అర్థం కాలేదు. నేనేదో చెబితే నా ఆలోచన చిన్నదని అంటారని రాశారు. ఏదేమైనా ఇది స్వేచ్ఛ కాదు.. మానసిక పిచ్చి అని నేను అంటాను. సో కాల్డ్ ఫెమినిస్టులు నన్ను దుర్భాషలాడవచ్చు కానీ ఇది నిజం..' అని ఓ నెటిజన్ తన ఆవేదన చెబుతూ కామెంట్ చేశారు.
Also Read: తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ ఓటమి.. రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ
Also Read: IPL Points Table: టాప్‌లేపిన రాజస్థాన్.. హైదరాబాద్ పరిస్థితి దారుణం.. మిగిలిన జట్లు ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి