Viral video Hungry elephant that broke into the kitchen and search for food : సాధారణంగా ఏనుగులు ప్రశాంతంగానే ఉంటాయి. కానీ వాటికి కోపం వస్తే మాత్రం చుట్టు పక్కల ప్రాంతాలన్నింటినీ అల్లకల్లోలం చేస్తాయి. ఇలాంటి సంఘటనలు మనం పొలాల్లో లేదంటే బయట బహిరంగ ప్రదేశాల్లో చూస్తుంటాం. కానీ కొన్ని సార్లు ఏనుగులు ఇళ్లపై కూడా ఇలాంటి దాడులు చేస్తుంటాయి. ఏకంగా ఇంట్లోకి చొరబడి భయబ్రాంతులకు గురి చేస్తుంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) వైరల్ అవుతోంది. ఒక ఏనుగు (elephant) ఏకంగా వంటిటి కిటికీ ధ్వసం చేసి అందులో నుంచి తొండం లోనికి పెట్టి దొరికిందల్లా కిందపడేసింది. 


ఏనుగు తనకు తినడానికి అక్కడేమైనా దొరుకుతుందేమో అన్నట్లు అంతా వెతికి చూసింది. వంటిట్లో ఉన్న సామగ్రిని అంతా వెతికింది. కొన్ని కవర్లను తొండంతో తీసుకుని అందులో తినడానికి ఏమైనా ఉందా అన్నట్లు చూసింది. 


Also Read : Omicron Cases in India: దేశంలో వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్.. 100కు పైగా కేసులు నమోదు


ఆ ఇంటి వాళ్లు ఇంట్లోని పాత్రలతో శబ్దాలు చేస్తూ ఏనుగును వెనక్కి పంపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఏనుగు అలాగే ఉండి వంట గది మొత్తం తొండంతో వెతుకుతూ ఉండిపోయింది. అంతేకాదు వంటగదిలో (Kitchen) తెరిచి ఉన్న అల్మారాను తొండంతో మూసి వేసింది. ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత్ నందా షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) వైరల్‌ అవుతోంది.



 


Also Read : Nagaland: నాగాలాండ్‌లో మెరుపు ధర్నా-వేలాదిగా వీధుల్లోకి పోటెత్తిన జనం...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook