Kerala bride and groom reaches wedding venue in Cooking Vessel: కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలాశయాలన్నీ నిండు కుండలా మారాయి. ఇక లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాల సంగతి అయితే చెప్పనక్కరేలేదు. వరద నీరు గ్రామాలను ముంచెత్తడంతో గ్రామాలన్ని జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఇన్ని ఇబ్బందుల మధ్య కేరళలో జరిగిన ఓ పెళ్లి వేడుక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేరళలోని అలప్పురకు సమీపంలోని తలవడిలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వీడియో వైరల్ అవడానికి కారణం ఇదిగో ఈ వీడియోలో చూపించినట్టుగా వధువు, వరులను ఒక పెద్ద వంట పాత్రలో కూర్చోబెట్టి నీళ్లపై పడవను తోసినట్టు తోసుకుంటూ తీసుకుపోవడమే. ఏంటి ఇంకా అర్థం కాలేదా ? అయితే, ఇదిగో ఈ వైరల్ వీడియోపై (Viral video) మీరూ ఓ లుక్కేయండి.



Also read : Viral Video:రన్నింగ్ రైలు నుండి దిగబోతూ కిందపడబోయిన గర్భిణీ.. కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్


చూశారు కదా.. అదండీ సంగతి!! భారీ వర్షాలు, వరదలు మధ్య కాబోయే నూతన దంపతులను పెళ్లి వేడుకకు (Kerala bride, groom video goes viral) ఎలా తరలించాలో అర్థం కాకపోవడంతో ఆ పెళ్లింటి వారు వేసిన కొత్త ఎత్తుగడ ప్రస్తుతం వారిని సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ టౌన్ అయ్యేలా చేసింది. 


ఈ వీడియో చూసిన నెటిజెన్స్.. ''వారెవ్వా.. వాట్ ఏన్ ఐడియా సర్ జి'' అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అదే వీడియోలో ఆ పక్కనే ఉన్న మరో వ్యక్తి మాట్లాడుతూ.. ''మనం పెళ్లి వేడుక కోసం కారును కాకుండా బోటును (cooking vessel used as boat in Kerala) కిరాయికి మాట్లాడుకుని ఉంటే బాగుండేదేమో'' అని వ్యాఖ్యానించడం మరో హైలైట్ అయింది. 


ఈ వైరల్ వీడియో (Viral video) చూశాకా మీలో చాలా మందికి ఒక సందేహం వచ్చి ఉండొచ్చేమో!! ఓవైపు భారీ వర్షాలు, వరదలతో జనం ఇబ్బంది పడుతోంటే ఇప్పటికిప్పుడే ఈ పెళ్లి చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది ? పెళ్లిని మరో తేదీకి వాయిదా వేసుకోలేకపోయారా ? అని. అయితే, ఆ ప్రశ్నలకు అన్నింటికి వచ్చే ఒకే ఒక్క జవాబు ఏంటంటే.. ఇంత మంచి, బలమైన ముహూర్తం ఇప్పుడు పోతే మళ్లీ ఎప్పుడో వస్తుందో అనే సందేహం, భయం వారిని ఈ పెళ్లి (Kerala bride and groom viral video) చేసుకునేందుకే మొగ్గుచూపేలా చేసింది. అదండీ సంగతి!!


Also read : Girl dancing on railway platform: రైల్వే స్టేషన్‌లో యువతి డ్యాన్స్.. వీడియో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook