leopard tries to enter safari bus in bannerghatta national park:  సాధారణంగా మనలో చాలా మంది అడవిలోని జంతువులు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. కొంత మంది వీకెండ్ లేదా సెలవులు దొరకగానే.. ఫ్యామిలీతో ఎక్కువగా గడిపేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. జూలకు, ఎనిమల్ సఫారీలకు వెళ్తుంటారు. అడవిలో క్రూర జంతువుల కోసం ప్రత్యేకంగా సఫారీలు ఉంటాయి. అక్కడ లోపలికి వెళ్లాలంటే కొన్ని బస్సులను, జీబ్ లను ఏర్పాటు చేస్తారు . వాటిని ఇనుప చువ్వలతో ఏర్పాటు చేస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రూర జంతువులు దాడిచేయకుండా కూడా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ తర్వాత బస్సులలో క్రూర జంతువులు ఉన్న ప్రదేశంలోకి టూరిస్టులను తీసుకుని వెళ్తారు. అయితే.. కొన్నిసందర్భాలలో అడవిల్లోకి వెళ్లినప్పుడు అనుకొని ఘటనలు జరుగుతుంటాయి. కొంత మంది అతిగా ప్రవర్తిస్తుంటారు. ఈ కోవకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.



పూర్తివివరాలు..


కర్ణాటకలోని బెంగళూరులో బన్నేర్ ఘట్ట నేషనల్ పార్క్ ఉంది. ఇది దాదాపు..23 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ఇటీవల దీనిలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. టూరిస్టులు బస్సులో క్రూర జంతువులు ఉన్న చోట సఫారీకి వెళ్లారు. టూరిస్టులంతా బస్సులో కూర్చుని ఉన్నారు. చుట్టుపక్కల సింహాలు, పులుల్ని, చిరుతల కోసం టూరిస్టులు చూస్తున్నారు. ఇంతలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


ఒక చిరుత బస్సు పక్కనుంచి వచ్చింది. అయితే.. ఆ బస్సు విండో ఓపెన్ చేసి ఉంది. దాని నుంచి ఎవరో చిరుతవైపు చూసినట్లున్నారు. దీంతో చిరుత తనకు ఎర దొరికిందోచ్ అని అమాంతం బస్సు మీదకు దూకింది. వెంటనే అలర్ట్ అయిన బస్సులోని వ్యక్తి విండోను క్లోజ్ చేశారు. దీంతో చిరుత కింద పడిపోయింది.


Read more: Viral Video: ప్రేయసీతో మాట్లాడుతూ.. లోకాన్ని మర్చిపోయాడు.. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..


వెంటనే టూరిస్టు బస్సు డ్రైవర్ బస్సును ముందరకు పోనిచ్చాడు. కాస్తంతలో ఆ బస్సులోని ప్రయాణికులు ప్రాణాలతో బైటపడ్డట్లు తెలుస్తోంది. పొరపాటున ఆ బస్సు కిటీకిలో నుంచి చిరుత లోపలికి వెళ్లుంటే.. పరిస్థితి ఏంటని కూడా చాలా మంది ఆందోళన చెందుతున్నారు.ఈ వీడియోప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.