Baby Alligator Attacks On Man: సాధారణంగా మొసళ్లు ఎక్కువగా చెరువులు, నీళ్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఉంటాయి. కొన్నిసార్లు వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతుంటాయి. అప్పుడు.. మొసళ్లు జనావాసాల్లోకి కొట్టుకుని వస్తుంటాయి. ఇలాంటి ఎన్నో ఘటనలు మనం చూశాం. మొసళ్లు చెరువులో ఉంటాయి. వీటిని చూస్తేనే భయంకరంగా ఉంటాయి. నీటిలో మొసలికి వంద ఏనుగుల బలం ఉంటుందని చెబుతుంటారు. అదే విధంగా కొత్తప్రాంతాలలో నీళ్లలో దిగేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



నీటిలో మొసళ్లు ఉండే అవకాశం ఉంటుంది. ఇవి చిన్నవిగా ఉన్న లేదా పెద్దవిగా ఉన్న దీని బారిన పడితే మాత్రం కొరికి మన రక్తం కళ్ల చూస్తాయి. ముఖ్యంగా మొసళ్లు ఎంత సేపు నీళ్లలో లేదా నీటి ఆవాసం చుట్టుపక్కల ఉండటానికి ఆసక్తి చూపిస్తాయి. అవి నెల మీద ఎక్కువ సేపు అస్సలు ఉండవు. వీటి జోలికి వెళితే మాత్రం రిస్క్ ను ఇన్ వైట్ చేసినట్లే.. అయితే.. ఒక మొసలి పిల్ల ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


ఒక వ్యక్తి తన చేతిలో చిన్న మొసలి పిల్లను తీసుకున్నాడు. దానితో కాసేపు ఆడుకున్నాడు. అంతే కాకుండా ఫోటొలకు కూడా ఫోజు లివ్వలని తన చేతిలో తీసుకుని అటు ఇటు కదిలించాడు. మరీ చిన్న మొసలికి కోపం వచ్చిందో ఏమో కానీ.. అది ఒక్కసారిగా సదరు వ్యక్తిపై దాడి చేసింది. అతని ముక్కును తన పదునైన పళ్లతో కొరికేసింది. ఒక్కసారిగా అతగాడు షాకింగ్ కు గురయ్యాడు.


Read More: Nayani Pavani: బ్లాక్ డ్రెస్స్ లో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ, బోల్డ్ పిక్స్ వైరల్


అప్పటికే మొసలి దాని పదునైన పళ్లతో రక్తం వచ్చేలా రక్కింది. ఈ వీడియోను లౌటిక్ 11 అనే యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అది కాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. మొసలి పిల్ల కూడా నిన్ను కిస్ చేసిందని, మరీ అందుకే జంతువుల జోలికి పొవద్దని కూడా కామెంట్ లు పెడుతున్నారు. కానీ పాపం.. అతని ముక్కు మీద చేతి గొర్లతో రక్కుకున్నట్లు, మొసలిదాని పదునైన పండ్లతో కరిచింది. ఆ బాధను తాళలేక అతగాడు.. గట్టిగా అరవడం కూడా వీడియో కూడా రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఇది మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook