Viral Video: పైన ఇమేజ్‌లో కనిపిస్తున్న ఫోటోలోని స్కూల్..విద్యా మందిర్. అక్షరాస్యతను అందించే ఆది దేవత సరస్వతి నిలయమంటారు. అందుకే పిల్లలు గానీ, ఉపాధ్యాయులు గానీ స్కూల్‌లోపలికి వెళ్లే ముందు చేతులు జోడించి తల వంచి నమస్కరించి వెళ్తారు. అలాంటి తరగతి గదులు దారి తప్పుతున్నాయి. ఆధునిక యుగంలో తరగతి గదుల్లో తప్పుగా ప్రవర్తిస్తున్నారు. ప్రేమ పేరుతో దురుసుగా వ్యవహరిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాము ఎక్కడ ఉన్నమో కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్లాల్సిన విద్యార్థుల్లో పాఠశాలలో చేసే పనులు అసహ్యాన్ని కల్గిస్తున్నాయి. ఓ స్కూల్‌లో విద్యార్థులు చేసిన పని వైరల్‌గా మారింది. తరగతి గది డోర్ వద్ద ఓ విద్యార్థిని..ఇద్దరు అమ్మాయిలు తోయగా.. అందులో ఓ అమ్మాయి..అబ్బాయిని కౌగిలించుకుంటూ ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది. ఈవీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యాచిలర్‌కి సోసైటీ పేజీలో నెటిజెన్ షేర్ చేశాడు.


షేర్ చేసిన కాసేపటికే వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు లక్షల్లో నెటిజన్లు చూశారు. దాదాపు 4 వేల మంది లైక్‌లు చేశారు. క్లాస్ రూమ్‌లో ఇలాంటి పని ఏంటి పలువురు మండిపడుతున్నారు. తరగతి గదిలో స్కూల్ టీచర్ లేని సమయంలో విద్యార్థులు ఇలా చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వాటిపై పాఠశాల సిబ్బంది నిఘా ఉంచాలంటున్నారు. 



Also read:IND vs AUS: ఉప్పల్ స్టేడియంలో టీమిండియా ఎన్ని విజయాలు సాధించిందో తెలుసా..?


Also read:Funny Viral Video: కోడి దెబ్బకు తోక ముడిచిన కోతి..వీడియో వైరల్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook