Crocodile Attacks Cow: నేలపై పాకుతూ, నీటిలో మునిగి తేలుతూ ఆహారాన్ని వేటాడే భయంకరమైన ప్రాణి ఏదైనా ఉందా అంటే అది మొసలే అని ఏ మాత్రం ఆలోచించకుండా చెప్పేయొచ్చు. నీటిలోనైనా.. లేదా నేలపైన అయినా ఒక మొసలి ఆహారాన్ని వెతుక్కుంటూ వేటకు బయల్దేరిందంటే.. తప్పకుండా ఏదో ఒక ప్రాణి దాని వేటకు బలి కావాల్సిందే. మొసలి పట్టు అలాంటిది. చిన్నచిన్న మొసళ్లు చేపలు, చిన్న జీవులను ఆహారంగా సరిపెట్టుకుంటే.. పెద్ద పెద్ద మొసళ్లు పెద్ద పెద్ద జంతువులనే ఆహారంగా వేటాడుతాయి అనే విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా పెద్ద పెద్ద చెరువులు, నది తీర ప్రాంతాల్లో మొసళ్లు దాక్కుని, నీళ్లు తాగడానికి వచ్చే జంతువులపై మాటువేసి మరీ దాడి చేస్తుంటాయి. నీళ్లలో దాక్కుని, నీళ్లు తాగడానికి చెరువులు, నది తీర ప్రాంతాలకు వచ్చే జంతువులపై ఒక్కసారిగా విరుచుకుపడుతుంటాయి. ఊహించని పరిణామానికి ఒక్కసారిగా షాకయ్యే జంతవులు.. అప్రమత్తంగా వ్యవహరించి తిరిగి ఎదురుదాడి చేస్తేనే వాటికి ప్రాణ హానీ తప్పినట్టు. లేదంటే ఇక అంతే సంగతి. అవతలి జంతువు మొసలికి ఏ మాత్రం లొంగిపోయినా.. ఆ జంతువుకు ఇక చావు తప్పదు. 


మొసలి తెలివి ఎలాంటిదంటే.. ఎంత బలమైన, శక్తివంతమైన జంతువునైనా సరే వెనుక భాగంలో నోట కరిచి విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుని నీటిలోకి లాక్కెళ్తుంది. మొసలి నీటిలోకి వెళ్లిందంటే ఇక దాని శక్తికి తిరుగుండదు. మరోవైపు నేలపై తిరిగే జంతువులకు నీటిలో మొసలితో పోరాడే శక్తి కూడా సన్నగల్లిపోతుంది. నేలపై అయినా, నీళ్లలో అయినా మొసలిపై విజయం సాధించాలంటే శక్తికి మించి పోరాడాల్సిందే. ఇదిగో ఈ వీడియో చూడండి.. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సందర్భానికి సరిగ్గా సూటయ్యే వీడియో ఇది. 



 


చూశారు కదా.. నీళ్లు తాగడానికి వచ్చిన గోవుపై దాడి చేసిన మొసలి.. ఆ గోవుకు తప్పించుకునే అవకాశమే లేకుండా చేసింది. దాదాపు ఇక ఆవు బలి అయినట్టే అనుకుంటున్న తరుణంలో ఆవు ప్రతిఘటించిన తీరుకు మొసలి పట్టు జారి కింద పడింది. అదే అదనుగా భావించిన ఆవు, మొసలి కన్నుమూసి తెరిచే లోపే అక్కడి నుంచి పరుగందుకుంది. లేదంటే ఉత్తి పుణ్యానికే మొసలికి బలి అయ్యుండేది. అందుకే పెద్దలు చెబుతుంటారు.. బలమైన శత్రువుపై గెలవాలంటే అంతకు మించిన శక్తియుక్తులు ప్రదర్శించి పోరాడి తీరాల్సిందేనని. లేదంటే శత్రువు చేతిలో ఓటమి తప్పదు. ఆవు, మొసలి వీడియో ( Crocodile vs Cheetah Video ) కూడా అలాంటి సందేశమే ఇచ్చింది కదా!! నిశితంగా గమనించాలే కానీ.. ప్రకృతిలో ప్రతీ జీవి ఏదో ఓ మంచి సందేశాన్ని ఇస్తూనే ఉంటాయి.


Also Read : Python Viral Video: వామ్మో!! 20 అడుగుల భారీ కొండచిలువ మనిషిని ఎలా నలిపేస్తుందో చూడండి


Also Read : Lizard Eating Watermelon: బల్లితో కలిసి పుచ్చకాయ తింటున్నాడు.. వైరల్ వీడియో


Also Read : Crocodile Attacks Cow: నీళ్లు తాగడానికి వచ్చిన ఆవును పట్టిన మొసలి.. తర్వాతేం జరిగిందో మీరే చూడండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook