Man dies of Heart Attack While Dancing: బర్త్ డే పార్టీలో అప్పటిదాకా హుషారుగా డ్యాన్స్ చేసిన ఓ వ్యక్తి డ్యాన్స్ స్టెప్పులేస్తూనే ఉన్నట్లుండి కుప్పకూలాడు. అక్కడున్నవాళ్లంతా మొదట అతను నటిస్తున్నాడేమో అనుకున్నారు. కానీ కొద్దిసేపు గడిచినా అతనిలో చలనం లేకపోవడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతను మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అతను డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌ రాయ్ బరేలీలోని ప్రేమ్ నగర్‌కి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఇటీవల బర్త్ డే పార్టీ జరిగింది. ఆ పార్టీకి ప్రభాత్ కుమార్ (48) అనే వ్యక్తి హాజరయ్యాడు. పార్టీలో హుషారుగా డ్యాన్స్ చేస్తూ కనిపించిన ఆయన.. ఒక్కసారిగా ఫ్లోర్‌పై కుప్పకూలిపోయాడు. ప్రభాత్ తమను భయపెట్టేందుకు నటిస్తున్నాడేమోనని మొదట అక్కడున్నవారు భావించారు. కానీ అతనిలో చలనం లేకపోవడంతో వెంటనే అప్రమత్తమయ్యారు.


ఆ పార్టీకి హాజరైన ఓ డాక్టర్ ప్రభాత్ కుమార్‌కి సీపీఆర్ (నోటి ద్వారా గాలి అందిస్తూ ఛాతిపై చేతులతో నొక్కడం) చేశారు. అయినప్పటికీ ఫలితం కనిపించలేదు. వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు వల్లే ప్రభాత్ చనిపోయినట్లు తెలిపారు. ప్రభాత్ డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలి కాలంలో ఇలా గుండెపోటుతో హఠాన్మరణం చెందుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో సింగర్ కృష్ణ కుమార్ కున్నత్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. 



Also Read: BJP VS TRS: బీజేపీ విమోచనాస్త్రం.. రంగంలోకి కేంద్ర బలగాలు.. సెప్టెంబరు17న ఏం జరగనుంది.. టీఆర్ఎస్ ఏం చేయనుంది?


Also Read: Serial Killer: షాకింగ్.. కేజీఎఫ్ రాకీభాయ్ ప్రేరణతో 5 రోజుల్లో 4 హత్యలు చేసిన 19 ఏళ్ల యువకుడు..   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook