Lizard Eating Watermelon: కొంతమంది జంతు ప్రేమికులు ఇంట్లో పిల్లులను, కుక్కలను పెంచుకోవడం చూస్తుంటాం.. ఇంకొంతమంది పక్షులను, పాములను పెంచుకోవడం చూస్తుంటాం.. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న మనిషి మహా వెరైటీ మనిషి. అందరిలాగే పిల్లులు, కుక్కలు, కుందేళ్లు, పక్షులను పెంచుకుంటే తనకుండే స్పెషాలిటీ ఏముంటుందనుకున్నాడో ఏమో.. ఇదిగో ఇలా బల్లి జాతికే చెందిన ఓ అరుదైన బల్లిని ఇంట్లో పెంచుకుంటున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బల్లిని పెంచుకోవడం అంటే చాలామంది ఇళ్లలో కనిపించే విధంగా ఏదో దాని పాలిట దాన్ని గోడపై వదిలేయడం కాదండోయ్.. తాను తినే తిండినే ఆ బల్లికి కూడా ఇష్టంగా పెట్టేంత గొప్ప మనసున్న బల్లి ప్రేమికుడు ఈ  వీడియోలో కనిపిస్తున్న యువకుడు. 


అవును.. మీరు చదివింది నిజమే. తాను పెంచుకుంటున్న బల్లి కోసం ఏదో ఒక ఆహారం ఏర్పాటు చేసి ఊరుకునే మనిషి కాదు ఈ యువకుడు. ఏకంగా తాను తింటున్న పుచ్చకాయనే బల్లితో కలిసి షేర్ చేసుకుంటున్నాడు చూడండి. పుచ్చకాయ ముక్కను ఒక వైపు తాను తింటుండగా.. మరోవైపు దానికి ఆహారంగా అందించాడు. అది కూడా ఏకకాలంలో. ఆ బల్లి సైతం అతిథిలా వచ్చి పుచ్చకాయ ఎంజాయ్ చేస్తూ కనిపించడం చూస్తే ఔరా అని అనిపించకమానదు.



 


ఈ వీడియో చూసి కొంతమంది నెటిజెన్స్ ఔరా అని ముక్కున వేలేసుకుంటుండగా.. ఇంకొంత మంది నెటిజెన్స్ కడుపులో ఏదో దేవినట్టు రియాక్షన్స్ ఇస్తున్నారు. పెంచుకోవడానికి బల్లే దొరికిందా.. ఇంకేం దొరకలేదా అని కొందరంటే.. బల్లితో కలిసి ఒకే ఆహారాన్ని కలిసి తినాల్సినంత అవసరం ఏముందని ఇంకొంతమంది నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. ఎవరేమని ప్రశ్నించినా ఐ డోంట్ కేర్ అన్నట్టుగా బల్లితో కలిసి పుచ్చకాయ ఎంజాయ్ చేస్తున్నాడు ఈ వ్యక్తి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ ( Viral Video ) అవుతోంది.


Also Read : Python Viral Video: వామ్మో!! 20 అడుగుల భారీ కొండచిలువ మనిషిని ఎలా నలిపేస్తుందో చూడండి


Also Read : Lizard Eating Watermelon: బల్లితో కలిసి పుచ్చకాయ తింటున్నాడు.. వైరల్ వీడియో


Also Read : Crocodile Attacks Cow: నీళ్లు తాగడానికి వచ్చిన ఆవును పట్టిన మొసలి.. తర్వాతేం జరిగిందో మీరే చూడండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook