Car Crash Test Viral Video: ప్రపంచంలోనైనా, దేశంలనైనా నిత్యం జరుగుతున్న అనేక రోడ్డు ప్రమాదాల వెనుకున్న కారణం హై స్పీడ్ డ్రైవింగ్. మితిమీరిన వేగంతో వాహనాన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లే క్రమంలో అనుకోకుండా రోడ్డుపై ఏమైనా అడ్డం వస్తే.. ఆ ప్రమాదాన్ని నివారించే సమయం లేక వాహనాలు అదుపుతప్పి ఆ ఎదురుగా వచ్చిన వాహానాలను, మనుషులను అదే వేగంతో ఢీకొట్టడం కానీ లేదా పక్కకు తప్పించే క్రమంలో అదుపు తప్పి పల్టీలు కొట్టడం కానీ జరుగుతోంది. నిత్యం మన దేశంలో ఇలాంటి రోడ్డు ప్రమాదాలు ఎన్నో వెలుగుచూస్తుండటం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ రోడ్డు ప్రమాదాల్లో వాహనం వేగం ఎంత ఎక్కువగా ఉంటే ప్రమాదం తీవ్రత అంత అధికంగా ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. ఇదే విషయాన్ని మరోసారి నిరూపిస్తూ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఏం ఉందంటే.. ఒక కారుకు సంబంధించిన క్రాష్ టెస్ట్ వీడియో ఇది. వివిధ స్థాయిల్లో స్పీడ్ మెయింటెన్ చేస్తూ రోడ్డుపై ఒక స్ట్రాంగ్ పిల్లర్‌ని ఢీకొంటే.. ఆ కారుకు జరిగే డ్యామేజ్ ఏ స్థాయిలో ఉంటుందో తెలుసుకునే ఉద్దేశంతో చేసిన కారు క్రాష్ టెస్ట్ అన్నమాట. కారు క్రాష్ టెస్ట్ వీడియోనే అయినప్పటికీ.. ఇది పరోక్షంగా మరో రకంగా కూడా ఉపయోగపడుతుంది. 


ఏదైనా కారు ఎంత అతి వేగంతో వెళ్లి అడ్డుగా ఉన్నదానిని ఢీకొంటే.. అందులో ఉన్న వారి ప్రాణాలకు అంత హానీ అంత ఎక్కువ హానీ ఉంటుంది అని చాటిచెప్పేలా ఈ వీడియో ఉంది. కారు హై స్పీడ్ పెరిగే కొద్దీ కారు డ్యామేజ్ అవుతున్న తీవ్రత పెరుగుతూ వచ్చింది. కారుకే అంత డ్యామేజ్ జరిగిందంటే.. సాధారణంగా అతి వేగంతో వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైన ఒక కారులో ఉన్న వారికి జరిగే హానీ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడానికి ఊహకు కూడా అందదు. 


ఉదాహరణకు హై స్పీడ్ యాక్సిడెంట్స్‌లో కారు తునాతునకలై అందులో ప్రయాణిస్తున్న వారు స్పాట్‌లోనే చనిపోవడమే కాదు.. కనీసం వారి శవాలు అందులోంచి వెలికి తీయడానికి కూడా వీల్లేని విధంగా చిక్కుకుపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. 2021 లో హై స్పీడ్ కారణంగా దాదాపు 3 లక్షల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా .. అందులో 1.07 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.