Lovers Hugging On Scooty Ride: ఇద్దరు లవర్స్ స్కూటీపై కౌగిలించుకుని వెళ్తున్న తీరు రోడ్డుపై వెళ్లే వారికి ఇబ్బందిగా అనిపించింది. వాళ్ల ప్రవర్తన కొంత అశ్లీలంగానూ ఉంది. ఇద్దరు లవర్స్ లో అబ్బాయి స్కూటీ నడుపుతుండగా... అతడి ఒళ్లో కూర్చున్నట్టుగా కూర్చున్న అమ్మాయి అతడిని బిగ్గరగా హత్తుకోవడం, మధ్యమధ్యలో ముఖంపై ముద్దులు పెట్టడం వంటి దృశ్యాలు నిజంగానే రోడ్డుపై వెళ్లే వారిని బాగా ఇబ్బంది పెట్టాయి. దీంతో వాళ్ల ప్రవర్తనపై విసిగిపోయిన తోటి వాహనదారులు.. ఆ ఇద్దరికి బుద్ది వచ్చేలా వారి స్కూటీ రైడ్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని వీధుల్లో మంగళవారం రాత్రిపూట కనిపించిన ఈ దృశ్యాన్ని జనం వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారి లక్నో పోలీసుల వరకు వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన లక్నో పోలీసులు.. ఆ స్కూటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా స్కూటీ రైడర్‌ని ట్రేస్ చేశారు. ఈ నేరానికి పాల్పడిన స్కూటీ రైడర్ విక్కీ శర్మను అరెస్ట్ చేసి అతడి స్కూటీని సీజ్ చేశారు. అతడిపై ఐపిసి 294, 279 సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతడితో కలిసి బైక్ పై అసభ్యకరంగా ప్రవర్తించిన అమ్మాయిని మైనర్ బాలికగా గుర్తించారు. 



 


 



 


ఈ ఘటనపై లక్నో సెంట్రల్ జోన్ డీసీపీ అపర్ణ రజత్ కౌషిక్ మీడియాతో మాట్లాడుతూ.. " ఈ వీడియో వైరల్ అయిన వెంటనే దర్యాప్తు ప్రారంభించి సీసీటీవీ కెమెరాల ఆధారంగా యువకుడిని ట్రేస్ చేయడం జరిగిందని.. ప్రస్తుతం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం" అని అన్నారు. స్కూటీ సీజ్ కావడంతో.. గాళ్ ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తున్నాను అని ఏదో అనుకుంటే ఏదో అయ్యిందే అన్నట్టుగా తయారైంది యువకుడి పరిస్థితి. 


ఇది కూడా చదవండి : Shubman Gill Century: విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ రికార్డు బద్దలు కొట్టిన శుభ్‌మన్‌ గిల్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో బ్యాటర్!


ఇది కూడా చదవండి : Rohit Sharma Record: ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ!


ఇది కూడా చదవండి : Uppal Stadium Match Tickets: ఉప్పల్ స్టేడియం టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్న వ్యక్తులు అరెస్ట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook