Massive Waves Video: అక్కడొక పెళ్లి వేడుక జరుగుతోంది. బంధుమిత్రులంతా ఎంజాయ్ చేస్తున్నారు. సెల్ఫీలు, ఫోటోలతో బిజీగా ఉన్నారు. అంతలో రాకాసి అలలు ఎగసిపడ్డాయి. మొత్తమంతా చెల్లాచెదురైపోయింది. సునామీ విరుచుకుపడిందా..ఏమైంది..ఎక్కడ జరిగింది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హవాయ్ ద్వీపంలోని కైలువా కోనాలో..ఓ సముద్ర తీరం. బీచ్ ఒడ్డున ఉన్న ఓ రిసార్ట్ . సాయం సంధ్యవేళ ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటుందని పెళ్లి వేడుక ప్లాన్ చేశారు. అందరూ ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. సెల్ఫీలు, ఫోటోలతో బిజీగా ఉన్నారు. డిన్నర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతలో రాకాసి అలలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. సముద్ర నీటిమట్టం గణనీయంగా పెరిగి మీదకొచ్చేసింది. హవాయ్ బీచ్ మొత్తం ఇదే పరిస్థితి. ఇళ్లపై, రోడ్లపైకి సముద్ర కెరటాలు విరుచుకుపడ్డాయి. ఆ రాకాసి అలలే ఈ పెళ్లి వేడుకపై దూసుకొచ్చేశాయి. అంతా ధ్వంసమైపోయింది. పెళ్లికి వచ్చిన అతిధులంతా పరుగులంకించుకున్నారు. కొందరు కెరటాల ఉధృతికి నీటిలో కొద్దిదూరం కొట్టుకుపోయారు. పెళ్లి వేడుకకు చేసిన డెకొరేషన్ అంతా నాశనమైపోయింది. 


ఇదంతా వీడియోలో రికార్డవడంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రాకాసి అలలు బీచ్ వాల్ దాటుకుని మీదకొచ్చేశాయి. అక్కడున్న కుర్చీలు, టేబుళ్లు వాషవుట్ అయ్యాయి. పెళ్లి వేడుక మరి కాస్సేపట్లో ప్రారంభం కానుందనగా ఈ రాకాసి అలల బీభత్సం చోటుచేసుకుంది.



ఇంత బీభత్సం జరిగినా..పెళ్లి వేడుక చాలా అందంగా జరిగిందని..సముద్రం తమను స్ప్రే చేసిందంటున్నారు. సముద్రం చాలా వైల్డ్‌గా ఉన్నా..ఫోటోలకు బాగుందంటున్నారు. రాకాసి అలలు దాదాపు 20 అడుగుల ఎత్తులో వచ్చినట్టు తెలుస్తోంది. వాతావరణంలో మార్పుల వల్ల ఇలా జరిగిందంటున్నారు నేషనల్ వెదర్ సర్వీస్ విభాగం అధికారులు. 


Also read: Bus Washed Away: వరదలకు కొట్టుకుపోయిన స్కూల్ బస్సు.. వైరల్ అవుతున్న వీడియో



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook