Crocodiles Fighting Viral Video: 2 మొసళ్ల మధ్య భీకర యుద్ధం.. వీడియో వైరల్
Crocodiles Fighting Viral Video: కోల్‌కతాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ క్యాంపస్‌లో కనిపించిన ఓ దృశ్యాన్ని ఫేమస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత్ నంద ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Crocodiles Fighting Viral Video: అడవిలో జంతువులు, పాములు వంటి వణ్యప్రాణులు ఘర్షణ పడిన దృశ్యాలను ఇంటర్నెట్లో వీడియోల రూపంలో ఎన్నోసార్లు చూసే ఉంటారు. కృూరమృగాలు ఘర్షణ పడిన తీరు చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. చూడ్డానికి గూస్‌బంప్స్ తెప్పించే వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోల్లో ఇది కూడా ఒకటి.
కోల్‌కతాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ క్యాంపస్‌లో కనిపించిన ఓ దృశ్యాన్ని ఫేమస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత్ నంద ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు మొసళ్లు ఇలా ఎదురెదురుగా నిలబడి యుద్ధం చేసుకుంటున్న దృశ్యాన్ని ఇంతకు ముందు ఎప్పుడూ మీరు కచ్చితంగా చూసి ఉండకపోవచ్చు. ఇది అలాంటి అరుదైన దృశ్యం.
తెల్లవారుజూమునే ఫైటింగ్‌తో తమ రోజును ప్రారంభించిన ఈ రెండు మొసళ్లు.. కొలను లోంచి బయటికొచ్చి మరీ ఇలా యుద్ధానికి దిగడం నెటిజెన్స్‌ని ఆసక్తిరేపుతోంది. మార్చి 1న సుశాంత్ నంద పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 392.6 లక్షల వ్యూస్ లభించగా 2 వేల లైక్స్ వచ్చాయి. ఈ వీడియోకు నెటిజెన్స్ నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఈ వైరల్ వీడియో వీక్షించిన నెటిజెన్స్ తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పోస్ట్ చేస్తున్నారు. అయితే, ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే.. ఐఐఎం క్యాంపస్‌లో ఉన్న కొలనులోకి ఈ మొసలి ఎలా వచ్చిందా అనే విషయం ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు.