Viral Video: ఉత్తర్‌ప్రదేశ్‌ ఇటావా జిల్లాలోని భర్తనా రైల్వే స్టేషన్‌లో తృటిలో ప్రమాదం తప్పింది. ప్లాట్ ఫారమ్, రైల్వే ట్రాక్ మధ్య పొరపాటున ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి అక్కడ పడిపోయినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే రైలు యమ స్పీడ్‌తో దూసుకెళ్లింది. ఆ వ్యక్తి ప్రమాదానికి గురై ఉంటాడని అంతా భావించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తీర రైలు వెళ్లిపోయిన తర్వాత లేచి ప్లాట్ ఫామ్‌పై ఉన్న ప్రయాణికులకు దండం పెట్టారు. బతికాను దేవుడా అన్నట్లు నడుచుకున్నాడు. ప్రయాణికులు సైతం ఏ జరుగుతోందని ఆశ్చర్య కరంగా చూశారు. ఈ వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆసక్తికరంగా తిలకిస్తున్నారు. విపరీతంగా కామెంట్లు ఇస్తున్నారు.


భర్తనా రైల్వే స్టేషన్‌లో ఉదయం 9.45 గంటల సమయంలో ఘటన జరిగింది. రైల్వే స్టేషన్‌లోని రెండో ప్లాట్ ఫారమ్‌పై నుంచి వ్యక్తి పడిపోయినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఈమేరకు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈఘటనలో అతడికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే స్టేషన్‌ల్లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.



Also read:Revanth Reddy: భారత్ జోడో యాత్రతో దేశ దశ దిశ మారుస్తామన్న రేవంత్‌రెడ్డి..!


Also read:T20 WC 2022: ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌నకు సౌతాఫ్రికా జట్టు ఇదే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి