Viral video: పితృపక్షాల్లో అద్భుతం.. సీపీఆర్ చేసి కాకి ప్రాణాలు కాపాడిన పోలీసు.. వైరల్ గా మారిన వీడియో ..
Tamilnadu news: కాకి ఒక్కసారిగా రోడ్డు మీద విలవిల్లాడుతూ పడిపోయింది. వెంటనే అక్కడే ఉన్న పోలీసు అధికారి దాన్ని చూసి వెంటనే సీపీఆర్ చేశారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Tamil Nadu police officers perform cpr to save electrocuted crow video: సాధారణంగా ఇటీవల కాలంలో గుండెజబ్బులు ఎక్కువయ్యాయి. అప్పటి వరకు బాగానే ఉన్నవాళ్లు ఒక్కసారిగా కింద పడిపోయి చనిపోతున్నారు. కానీ గుండెనొప్పి వచ్చిన వాళ్లకు సీపీఆర్ చేస్తే వారికి ప్రాణాపాయం తప్పుతుందని డాక్టర్లు చెబుతుంటారు.
అందుకే చాలా చోట్ల సీపీఆర్ పట్ల అవగాహాన కూడా కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో..ఇప్పటి వరకు సీపీఆర్ చేయడం వల్ల కూడా మనుషులతో పాటు, నోరులేని జీవాలు సైతం ప్రాణాలతో బైటపడిన ఘటనలు కొకొల్లలు. సీపీఆర్ లో ముఖ్యంగా.. మనిషి అపస్మారకస్థితిలోనికి వెళ్లిపోయిన తర్వాత వెంటనే అతడికి.. గుండె మీద మన చేతిలో గట్టిగా ప్రెస్ చేస్తు ఉండాలి.
ఇలా చేస్తే వారిలో కదలిక అనేది ఏర్పడుతుంది. దీని వల్ల మనిషి బతికే చాన్స్ 90 శాతం ఉంటుందని కూడా నిపుణులు చెబుతున్నారు. సమయానికి సీపీఆర్ చేయడం వల్ల ఇప్పటి వరకు మనుషులు మాత్రమే కాకుండా.. ఇటీవల కాలంలో నోరులేని జీవాలు సైతం బతుకున్నాయి. ఇటీవల ఒక పోలీసులు.. వడదెబ్బతి పడిపోయిన కోతికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. అదే విధంగా.. ఇప్పుడు ఒకకాకిని పోలీసు.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
తమిళనాడులో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోయంబత్తూరులోని కవుందంపాళయం అగ్నిమాపక కేంద్రం సమీపంలో ఒక కాకి ట్రాన్స్‌ఫార్మర్‌పైవాలి విద్యుదాఘాతానికి గురైంది. వెంటనే.. అది స్పృహతప్పి పడిపోయింది. దీన్ని అక్కడున్న ఫైర్ పోలీసులు సిబ్బంది గమనించాడు.
వెంటనే.. వెల్లదురై అనే అధికారి అక్కడికి చేరుకుని, సాయం చేసేందుకు పరుగెత్తాడు. అతను మెల్లగా పక్షిని ఎత్తుకుని సీపీఆర్ చేసాడు. కాకి తన నోటితో ఊపిరి సైతం ఇచ్చాడు. దీంతో అది మెల్లగాదానిలో కదలికలు వచ్చాయి.
కాసేటికి మొత్తంగా తన బలాన్ని పుంజుకున్న కాకి..అక్కడి నుంచి ఎగిరేందుకు ప్రయత్నించింది. వెల్లదురై కాకిని గాల్లోకి వదిలేశాడు.అది ఎగురుతూ వెళ్లిపొయింది. అక్కడున్న వారు.. వెల్లదురై చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీన్ని చూసిన పోలీసులు శభాష్ సర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో పితృపక్షాల పుణ్యకాలం నడుస్తోంది. ఈ సమయంలో కాకికి ఉన్న ప్రాధాన్యం స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. కాకి కోసం చాలా మంది కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారు. కాకి పిండంను ముట్టుకోకుంటే.. ఆత్మకు శాంతి ఉండదంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.