Viral Video: మాటల్లేవ్.. ఈ వీడియోలో ఎలుగుబంటి చేసిన పని చూస్తే ఫిదా అయిపోతారు.. వైరల్ వీడియో ఇదే..
Mothers Emotional Love: మంచుతో నిండి ఉన్న ప్రాంతంలో ధ్రువపు ఎలుగుబంటి తన పిల్ల ఎలుగుతో కలిసి ఉంది. ఇంతలో పిల్ల ఎలుగు బంటి నీళ్లలోనుంచి పైకి రావడానికి ప్రయత్నించింది. కానీ ఇంతలో పాపాం..పిల్ల ఎలుగు పైకి ఎక్కలేక ఇబ్బందులు పడిపోతుంది. ఇంతలో దూరం నుంచి తల్లి ఏలుగు బంటి పరిగెత్తుకు వచ్చింది. ఎమోషనల్ కల్గించే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Polar Bear Rescues Her Little Cub: అమ్మ ప్రేమకన్నా.. ప్రపంచంలో ఏది గొప్పదికాదని చెబుతుంటారు. అది మనుషులైన , నోరూ లేని జంతులులైన కూడా తమ పిల్లల మీద ఉన్న ప్రేమను ఒకేలా వ్యక్త పరుస్తాయి. మన చుట్టుపక్కల వారిని గమనిస్తుంటే.. తాము ఎంత బిజీ పనుల్లో ఉన్న కూడా తమ పిల్లల మీద ఒకకన్నేసి ఉంటారు. పొరపాటున బిడ్డ ఏడిస్తే వంద పనులు పక్కన పెట్టేసీ మరీ తమ బిడ్డవైపు పరుగులు పెడతారు. ఎప్పుడైన తమ బిడ్డకు ఏదైన జరిగితే బాధతో విలవిల్లాడిపోతారు. బిడ్డ కోసం ఎంతటి త్యాగం చేయడానికైన, ఎవరితో పొట్లాడటానికైన తల్లులు వెనుకాడరు. ఎందరో తల్లులు తమ బిడ్డల కోసం కష్టపడి పెంచడం, జీవితంలో సెటిల్ అయ్యేలా చేయడం మనం చూస్తుంటాం. ఇలాంటి ఎన్నో కథనాలు తరచుగా వార్తలలో ఉంటాయి.
ఇక.. మనుషులే కాదూ.. నోరులేని జంతువులు కూడా తమ బిడ్డలంటే ప్రాణాలు ఇచ్చేస్తుంటాయి. అది కోతులు, ఏనుగులు, సింహాలు, పులులు, కుక్కలు, పిల్లులు.. ఇలా ఏ జంతువును తీసుకున్న ఎవరైన తమ బిడ్డ జోలికి వస్తే, అవతల వైపు సింహాం ఉన్నా, మరే జంతులు ఉన్న అస్సలు వెనక్కు తగ్గవు.. తమ ప్రాణాలు సైతం అడ్డుపెట్టి, హనీ కల్గించే జంతువు మీద దాడిచేస్తాయి. ఇక తమ బిడ్డ కష్టాలలో ఉంటే.. మనుషులే కాదూ.. నోరు లేని జీవాలు సైతం విలవిల్లాడిపోతాయి. ఇలాంటి ఎమోషన్ ను కల్గించే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో కొన్ని వేల సంఖ్యలో వీడియోలు తరచుగా వైరల్ గా మారుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే, మరికొన్ని వీడియో ఎమోషనల్ ను కల్గించేవిగా ఉంటాయి. అచ్చం ఇలాంటి ఒక వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఈ వీడియోను గాబ్రియల్ కార్నో అనే యూజన్ తన ట్విటర్ అకౌంట్ లో పోస్టు చేశాడు. దీనిలో ఒక ధ్రువపు ఎలుగు బంటి తన పిల్లతో కలసి ఉంది. ఆప్రాంత మంతా మంచుతో పూర్తిగా కప్పబడి ఉంది.
తల్లి ఎలుగు బంటి పైన కూర్చుని ఉంది. పిల్ల ఎలుగు బంటి నీళ్ల నుంచి పైకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఎంత ట్రై చేసిన కూడా పిల్ల ఎలుగు బంటి నీళ్లలోనికి జారిపోతుంది. అప్పుడు ఒక ఎమోషనల్ మూమెంట్ జరిగింది. తల్లి ఎలుగు.. ఒక్కసారిగా స్పీడ్ గా వచ్చి నీళ్లలోనికి జంప్ చేసింది.
Read More: Deepthi Sunaina hot pics: హాట్ షో తో రెచ్చిపోయినా దీప్తి సునైనా.. మరి ఇంత దారుణంగానా..!
అంతేకాకుండా.. నీళ్లనుంచి పైకి రావడానికి ప్రయత్నిస్తున్న పిల్ల ఎలుగుకు కింద నుంచి సపోర్ట్ ఇచ్చి, చేతులతో పైకి నెట్టింది. దీంతో పిల్ల ఎలుగు ఈజీగా పైకి ఎక్కేసింది. ఈవీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. తల్లి ప్రేమ అంటే ఇదేగా.. మాటల్లేవ్.. ఎమోషన్ కల్గిస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook