Urfi Javed Brother Mirchi Javed: ఎండు మిర్చితో డ్రెస్.. ఉర్ఫీ జావేద్ ని మించిన డ్రెస్.. వీడియో చూస్తే పడి పడి నవ్వాల్సిందే!

Urfi Javed Brother Mirchi Javed Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా రకాల రీల్స్ వైరల్‌గా మారుతున్నాయి. అయితే ఈ రోజు డూప్ ఉర్ఫీ తమ్ముడు మిర్చి జావేద్ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూస్తే నవ్వు కోవాల్సిందే..
Urfi Javed Brother Mirchi Javed Funny Video: టిక్‌టాక్ కారణంగా సోషల్ మీడియా యాప్ క్రేజ్ ఒక్క సారిగా పెరిగిపోయింది. అంతేకాకుండా రీల్స్ ద్వారా చాలా మంది ట్రెండ్ అయ్యారు. సోషల్ మీడియాల్లో రీల్స్ చేస్తూ చాలా మంది సినిమా నటులుగా కూడా మారారు. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఉర్ఫీ జావేద్ కూడా రీల్స్ నుంచే పరిచయమైంది. ప్రస్తుతం ఇప్పుడు రోజు ఏదో ఒక కొత్త స్టైల్‌తో మన ముందుకు వస్తుంది. రకరకాల కొత్త డ్రెస్‌లతో నెటిజన్లకు చెమటలు పట్టిస్తుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ యువకుడి వీడియో కూడా అచ్చం ఉర్ఫీ జావేద్‌ను అనుసరించి రీల్స్ చేస్తున్నట్లు అనిపిస్తోంది.
ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది ధరించే దుస్తువుల్లో మార్పులు చేర్పులు వస్తున్నాయి. అందరూ నయా ట్రెండ్‌లో నడిచేందుకు ఫంకీ దుస్తువులను ధరిస్తుంది. అయితే ఇలాంటి బట్టలను వేసుకుని రీల్స్ చేయ్యడంలో ఉర్ఫీ జావేద్ ఎప్పుడు ముందుంటుంది. ఆమె ప్రతి రోజూ ఏదో స్టైల్‌లో ఫ్యాషన్ దుస్తులను ధరించి సోషల్ మీడియాలో ముందుంటుంది. ఇప్పుడు ఆమె స్టైల్‌నే ఇంకా యువకు అనుసరిస్తున్నాడు. వస్తువులను దుస్తువులుగా మార్చుకుని, వాటిని ధరించి సోషల్ మీడియాల్లో రీల్స్‌గా పెడుతున్నాడు. ప్రస్తుతం ఈ యువకుడికి సంబంధించిన వైరల్ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ యువకుడు అచ్చం ఉర్ఫీ జావేద్ స్టైల్‌ని ఫాలో అయినట్లు అనిపిస్తుంది. ఎండు మిరపకాయలను డ్రెస్సులా తయారు చేసుకుని, దానిని ధరించి సేమ్ టూ సేమ్ ఉర్ఫీలా ఫోజులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ యువకుడి వీడియోను చూసిన నెటిజన్లు కిచ్చ కిచ్చ నవ్వుకుంటున్నారు. మరి కొందరైతే 'ఉర్ఫీ తమ్ముడు మిర్చి జావేద్' అని కామెంట్ల రూపంలో వారి అభిప్రాయలను కూడా తెలుపుతున్నారు. ఈ వీడియోను tik_toker_tharun అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Also Read: White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook