COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Latest Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఢిల్లీ మెట్రోకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో కొన్ని హాస్యాస్పదంగా ఉంటే మరికొన్ని మాత్రం తోటి ప్రయాణికులు ఇబ్బంది  పెట్టి సన్నివేశాలు మీరు గమనించవచ్చు. ఇటీవల కొన్ని ప్రేమజంటలు మెట్రో రైల్ లో రొమాన్స్ చేస్తున్న వీడియోలు చూసి ఉంటారు. అయితే దీనికి భిన్నంగా ప్రస్తుతం ముంబై లోకల్ ట్రైన్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వాయురాలు అవుతోంది. వీడియో చూసిన నటిజన్లో ఆహా, ఓహో అంటున్నారు. ఇంతకీ ఈ వీడియో ఏంటో..వైరల్ అవ్వడానికి కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ముంబై లోకల్ ట్రైన్ ద్వారా లక్షల మంది వారి గమ్యస్థానాలకు చేరుకుంటారు. అంతేకాకుండా అన్ని ప్రయాణాల్లోకెల్లా ఈ ప్రయాణం చాలా చౌకగాని చెప్పవచ్చు. కాబట్టి మధ్యతరగతి వారి నుంచి ధనికుల వరకు ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తారు. అయితే చాలామంది స్నాక్స్ లో భాగంగా సమోసాతో పాటు ఇతర ఆహార పదార్థాలను కొనుక్కొని తింటూ ఉంటారు. ఇలా చిన్నవారి నుంచి పెద్దవారి దాకా ప్రయాణంలో భాగంగా ఏదో ఒకటి తింటూ ఉంటారు. అయితే ముంబైలో లోకల్ ట్రైన్ లో కొందరు యువకులు ప్రయాణికుల కోసం కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు.





వీడియో వివరాల్లోకి వెళితే కొందరు యువకులు ముంబై లోకల్ ట్రైన్ లో ఆహారాలు విక్రయించడం మీరు చూడొచ్చు. అయితే వారు ఈ ఆహారాలను ముంబాయి లోకల్ ట్రైన్ రెస్టారెంట్ పేరుతో రుచికరమైన ఆహారాలను అందిస్తున్నారు. ఆర్యన్ కటారియా, సార్థక్ అనే ఇద్దరు ముంబై లోకల్ ట్రైన్ లోనే చిన్న స్టార్ట్అప్ ని ప్రారంభించారు. వీరిద్దరూ ఆహారాలను విక్రయిస్తున్న ఓ రియల్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అంతేకాకుండా ఈ ఫుడ్ మెనూకి టేస్టీ టికెట్ అని పేరు కూడా పెట్టారు. 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


కటారియా మాట్లాడుతూ.."చాలామంది మా స్టార్ట్ అప్ ని చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పటివరకు ఇలాంటి బిజినెస్ ఎవరూ చేయలేరు అతి త్వరలోనే ఈ ఫుడ్ బిజినెస్ ను అన్ని రైలలో ఎక్స్పెండ్ చేస్తాము. అంతేకాకుండా లోకల్ ట్రైన్ లో మా టేస్టీ ఫుడ్ తిన్న చాలామంది ఆశ్చర్యపోయారు."అని అన్నారు. ఈ ముంబాయి లోకల్ ట్రైన్ లో వీరిద్దరు అందిస్తున్న ఫుడ్ తిన్న కొందరు ప్రయాణికులు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ చాలా బాగుందని అందరూ టేస్ట్ చేయాలని కోరారు.


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి