Fancy wedding entry resulted in an epic fail: సాధారణంగా పెళ్లంటే ఇంట్లో ఓ పెద్ద సంబరం. అందుకే పెళ్లి అనగానే చాలా మంది ఖర్చు గురించి వెనకాడరు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకప్పుడైతే వంటకాలు, పెళ్లి సెట్​ వంటివి ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. కానీ ఇప్పుడు (Wedding Trends) ట్రెండ్ మారింది. పెళ్లిలో ఏదైనా కొత్తధనం ఉండాలనుకుంటున్నారు చాలా మంది. పెళ్లి కూతురు, పెళ్లు కొడుకు కలిసి స్టెప్పులేయడం నుంచి పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ వంటివి ఇందుకు చిన్న ఉదాహరణలు.


వీటన్నింటిని పెళ్లి చేసుకోబోయే వారు వీడియో తీయించుకుని భద్రంగా దాచుకోవడం కూడా ఈ ట్రెండ్​లో భాగమే.


అయితే కొన్ని సార్లు మాత్రం వినూత్నంగా ఉండాలని కొంత మంది కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. కొన్ని సార్లు ఇవి హిట్టయి.. చాలా మంది వాటినే ఫాలో అవుతుంటారు. అయితే ఇంకొన్నిసార్లు ఈ ప్రయోగాలు సక్సెస్ కావు. సోషల్ మీడియాలో ఇలాంటి ఫన్ని ఫేల్యూర్ వీడియోలు కుప్పలు తెప్పలుగా (Funny wedding fails) కనిపిస్తాయి. అయితే వాటి సరసన ఓ కొత్త వీడియో వచ్చి చేరింది.


Also read: Man cuts his own legs: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కాళ్లు నరుక్కున్న వ్యక్తి


Also read: Scorpion Farming on Terrace : ఇంటి టెర్రస్‌పై తేళ్లలాంటి క్రాఫిష్ సాగు.. దున్నేస్తేన్న యువతి


ఇంతకి ఆ వీడియోలో ఏముందంటే..


పెళ్లి చేసుకునే జంట ఏనుగులు, గుర్రాలపై మండపానికి చేరుకోవడం పాత ఫ్యాషన్ అనుకున్నారో ఏమో కానీ.. ఇక్కడ వీళ్లు గాలిలో ఎగురుతున్నట్లుగా మండపంలోకి వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు.


ఓ క్రేన్​ లాంటి వాహనం సహాయంతో.. ముందువైపు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కూర్చునెలా (Wedding enntry fails) ఏర్పాటు చేశారు. అందులో వారు కూర్చున్న తర్వాత.. ఆ వాహనం అలా ముందుకు కదులుతూ వారిని మండపంలో దించాలనేది ప్లాన్.


Also read: Viral Photo: నీ తెలివికి దండంరా అయ్యా..! తెగిన చెప్పులకు నట్-బోల్ట్‌లు.. క్షణాల్లో వైరల్!


కొంత సేపు ఇది బాగానే పని చేసింది. పెళ్లికి వచ్చిన అతిథులు కూడా ఆశ్యర్యంగా చూస్తున్నారు. ఇంతలోనే ఆ వాహనంపైన నుంచి జారి.. నూతన వధూ వరులు కిందకు పడ్డారు. దీనితో అక్కడున్న వారంతా ఒక్క సారిగా షాకై.. వారిని పైకి లేపారు. అయితే చిన్న చిన్న గాయాలు తప్పా వారికి ఏం కాలేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.



అయితే ఇది ప్రత్యక్షంగా చూసిన వారిని అయ్యో అనిపించేలా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం నవ్వులు పూయిస్తోంది. ఇన్​స్టాగ్రామ్లో ఈ విడీయో ఇప్పుడు వైరల్​గా మారింది.


కాగా ఈ వీడియోలో ఉన్న ఘటన ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? అనే వివరాలు మాత్రం వీడియో పోస్ట్​ చేసిన వారు వెల్లడించలేదు.


Also read: Man praying god before stealing hundi: హుండి ఎత్తుకెళ్లడానికొచ్చి ఏం చేశాడో చూడండి.. వైరల్ వీడియో


Also read: Children's Day 2021: బాలల దినోత్సవం నవంబర్ 14కి ఎలా మారిందో తెలుసా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి