BJP MLA's son cake cutting with iPhone: బెంగళూరు: ఐఫోన్ కొనడమే కష్టం. ఒకవేళ కొన్నారే అనుకో.. ఆ ఫోన్‌ని అత్యంత అపురూపంగా చూసుకుని మురిసిపోతుంటారు. కానీ అదంతా కష్టపడి ఐఫోన్ కొనుక్కునే వాళ్లకు. తేరగా వస్తేనో లేక కష్టపడకుండానే నాన్న కొనిస్తేనో వచ్చే ఖరీదైన వాటి విలువ గురించి తెలుసుకోలేని వాళ్లకు కాదు. ఇప్పుడు ఐఫోన్ గురించి ఈ ఉపోద్ఘాతం ఎందుకా అని అనుకుంటున్నారా ? అయితే, కర్ణాటకలోని కనకగిరి ఎమ్మెల్యే, బీజేపి నేత బసవరాజ్ దదెసుగుర్ తనయుడు సురేష్ సుగుర్ ధనం ఉందనే అహంకారంతో చేసిన ఈ పని గురించి మీరు చూడాల్సిందే. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


చూశారు కదా వీడియోలో.. సురేష్ తన ఖరీదైన ఐఫోన్‌తో తన బర్త్ డే కేక్స్ కట్ చేస్తున్న ఈ వీడియో (Birthday cake cutting with iPhone) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది కూడా ఒక్క కేక్ కాదు.. రెండు కేకులు కాదు.. ఏకంగా ఎనిమిది కేకులు ఐఫోన్‌తో కట్ చేసి తన ఆస్తి, ఐశ్వర్వ్యాన్ని అందరి ముందు ఇలా డిస్‌ప్లే చేశాడు. బీఎండబ్ల్యూ కారులో తన స్నేహితులను హోస్పేట తీసుకెళ్లిన సురేష్.. అక్కడే ఇలా బర్త్ డే కేకులు కట్ చేసిన వైనం సోషల్ మీడియాలో వైరల్ (Viral videos) కాగా.. నెటిజెన్స్ సురేష్ వైఖరిపై మండిపడుతున్నారు.


Also read : Scary video: పైకప్పులోంచి వేలాడుతున్న "దెయ్యం తల".... తరువాతేం జరిగింది??


కర్ణాటక కాంగ్రెస్ నేతలు సైతం బీజేపి ఎమ్మెల్యే బసవరాజ్‌ని (Karnataka BJP MLA Basavaraj Dadesugur) లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో ఎంతో మంది తినడానికి పట్టెడు అన్నం లేక ఆకలి చావులు చస్తుంటే.. ఎమ్మెల్యే కుటుంబం మాత్రం అదేమీ పట్టించుకోకుండా విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారని ది న్యూస్ మినిట్ తమ కథనంలో పేర్కొంది. మొత్తానికి కొడుకు చేసిన ఈ పనికిమాలిన పనికి సంబంధించిన వీడియో వైరల్ (Viral videos) కావడంతో సదరు బీజేపి ఎమ్మెల్యే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.


Also read : Viral: వలలో చిక్కిన 'ఘోల్‌' చేపలు..ఒక్కరోజులో కోటీశ్వరుడైన జాలరి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook