Viral Video today: ఈ బుజ్జి ఏనుగుకు ముందే వచ్చేసిన హోలీ.. ఎలా ఆడుతుందో చూడండి..
Today trends: సోషల్ మీడియాలో ఈ మధ్య వైరల్ అవుతున్న వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా ఓ ఏనుగు వీడియో హృదయాన్ని హత్తుకుంటుంది. మీరు ఓ లుక్కేయండి.
Viral Video today: టెక్నాలజీ వచ్చాక మానవుడు సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్నాడు. ఉన్నదానిని లేనట్టూ, లేని దానిని ఉన్నట్టూ క్రియేట్ చేస్తున్నాడు. మనిషి ఆవిష్కరించిన అతి గొప్ప ఆవిష్కరణ సెల్ ఫోన్. ఇది మానవ జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. దీనిని కొందరు మంచికి ఉపయోగించుకుంటే, మరికొందరు చెడు పనులకు వాడుతున్నారు. ప్రస్తుతం మనం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ యుగంలో ఉన్నాం. ఇది ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో.. మనల్ని అంతే ఇబ్బందులకు గురిచేస్తుంది. రీసెంట్ గా దీని ద్వారా క్రియేట్ చేసిన ఢీఫ్ ఫేక్ వీడియోలు సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. రష్మిక మందన్నా, కత్రినా, సచిన్, విరాట్ కోహ్లీ.. ఈ ఢీఫ్ ఫేక్ బారిన పడిన సంగతి తెలిసిందే.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరూ డిఫరెంట్ గా ఆలోచించడం మెుదలుపెట్టారు. తమను ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరుకుంటున్నారు. దానికి తగినట్లే రకరకాల వీడియోలు చేస్తూ నెట్టింట ఫేమస్ అవుతున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఎలాంటి వీడియోనైనా చిత్రీకరించవచ్చు. ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫన్నీ వీడియో నెట్టింట సందడి చేస్తోంది.
హోలీ పండుగ గురించి మనందరికీ తెలిసిందే. ఈరోజున మనందరం రంగులు చల్లుకుంటూ, గాలిపటాలు ఎగరేస్తూ ఆనందం గడుపుతాం. ఈ సంవత్సరం హోలీ మార్చి 25న రాబోతుంది. కానీ ఈ వీడియోలో ఉన్న బుజ్జి ఏనుగుకు ముందుగానే హోలీ వచ్చేసింది. ఇది మట్టితో హోలీ జరుపుకోవడం చూసి నెటిజన్స్ తెగ నవ్వుకుంటున్నారు. ఇందులో గజరాజు మోకాళ్లపై కూర్చుని హోలీ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్స్ ను తెగ ఆకట్టుకుంటుంది. మీరు ఓ లుక్కేయండి.
Also Read: Viral Video: ఏంటి భయ్యా ఇంత వైలెంట్ గా ఉన్నావ్.. పరోటాను ఈ రేంజ్ లో ఎవరైనా ఉతుకుతారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook