Viral video today: మన తాతలు, నాన్నల కాలంలో బార్బర్లు అందరికీ ఒకే రకమైన హెయిర్ కట్ చేసేవారు. ట్రెండ్ మారేకొద్దీ బార్బర్లు కూడా అప్ డేట్ అయ్యారు. కస్టమర్ల అభిరుచికి తగినట్లు రకరకాల స్టైల్స్​లో హెయిర్​కట్ చేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో గల్లీ గల్లీకి సెలూన్లు పుట్టుకొస్తుండటంతో సెలూన్ల మధ్య పోటీ కూడా విపరీతంగా పెరిగింది. దీంతో జనాలను ఆకట్టుకునేందుకు డిఫరెంట్ టెక్నిక్స్ వాడుతున్నారు నిర్వాహకులు. గతంలో బార్బర్స్ దువ్వెన, కత్తెరను ఉపయోగించి హెయిర్ కట్ చేసేవారు. తాజాగా ఓ బార్బర్ వెరైటీగా హెయిర్​కట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వీడియోలో.. ఓ బార్బర్ తన షాపుకు వచ్చిన క్లయింట్ కి వినూత్న స్టైల్లో హెయిర్ కట్ చేశాడు. కత్తెర లేదా క్లిప్పర్ లకు బదులు నిప్పు పెట్టి జుట్టు కత్తిరించాడు బార్బర్. అతడి హెయిర్ స్టైల్ చూడటానికి చాలా బాగుంది. ఇందులో మంగళి తెలివితేటలకు జనాలు ఆశ్చర్చపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.  నెటిజన్స్ దీనిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇలా హెయిర్​కట్​ చేయడం చాలా రిస్క్. జుట్టు కత్తిరించడంలో ఏ మాత్రం పొరపాటు చేసిన ప్రాణాలకే ప్రమాదం. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా ఇట్టే వైరల్ అయిపోతుంది. అలాంటి వీడియోల్లో ఇది ఒకటి. 



Also Read: Viral Video today: వాటర్ బాటిల్ ఎత్తుకెళ్లిన పెద్దపులి.. వైరల్ అవుతున్న వీడియో..


Also Read: Viral News: బాస్ కు ఊహించని షాక్.. లీవ్స్ క్యాన్సిల్ చేసినందుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఉద్యోగి.. అసలేం జరిగిందంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook