Mother risks her Child life for her Saree: సాధారణంగా మహిళలకు చీరలు, నగలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ ఇష్టం ప్రాణాలను రిస్క్‌లో పెట్టేంతగా ఉంటే.. అంతకుమించిన పిచ్చి మరొకటి ఉండదు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఓ మహిళ ఇలాంటి పనే చేసింది. చీర కోసం ఏకంగా తన కొడుకు ప్రాణాలనే రిస్క్‌లో పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే.. ఫరీదాబాద్‌లోని హై-రైజ్ సొసైటీ 10వ అంతస్తులో నివసించే ఓ మహిళ ఇటీవల ఓరోజు తమ ఫ్లాట్‌లోని బాల్కనీలో బట్టలు ఆరేసింది. అందులో ఓ చీర బాల్కనీ నుంచి ఎగిరిపోయి 9వ అంతస్తులో ఉన్న బాల్కనీలో పడిపోయింది. అయితే ఆ చీరను తీసుకొచ్చేందుకు ఆ మహిళ ఎవరూ చేయని రిస్క్ చేసింది. ఆ ఇంటికి తాళం వేసి ఉండటంతో.. బెడ్ షీట్‌ సాయంతో అతని కొడుకును కింది అంతస్తులోని బాల్కనీలోకి దింపింది. 



ఆ తర్వాత అదే బెడ్ షీట్ సాయంతో అతన్ని పై అంతస్తులోకి లాగింది. మొత్తానికి కొడుకు ప్రాణాలను రిస్క్‌లో పెట్టి మరీ ఆమె తన చీరను తెప్పించుకోగలిగింది. ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లోని వ్యక్తులు దాన్ని సెల్‌ఫోన్‌తో షూట్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఐపీఎస్ ఆఫీసర్ దీపాన్షు కబ్రా ఆ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేయగా.. నెటిజన్లు ఆ మహిళపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. చీర కోసం కొడుకు ప్రాణాలను రిస్క్‌లో పెడుతావా.. ఇంత నిర్లక్ష్యమా అని మండిపడుతున్నారు.


Also Read: IPL Mega Auction 2022: ట్రెంట్‌ బౌల్ట్‌కు రాజస్తాన్ భారీ ధర.. రిటైన్ చేసుకోలేకపోయిన ముంబై..


Also Read: David Warner DC: అయ్యో డేవిడ్ వార్నర్.. ఎంత పనాయే! మరీ ఇంత తక్కువనా!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook