Watch Video: నేపాల్‌లో భయానక హిమపాతం.. చూస్తే చెమటలు పట్టడం ఖాయం..
Viral Video: హిమాలయాల్లో హిమపాతాలు సంభవించడం సాధారణం. కానీ ఇటీవల నేపాల్ లో మంచు పర్వతంపై వచ్చిన హిమపాతం ఇంతముందుకు ఎప్పుడూ చూడనంత పెద్దది. దీని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Viral Video: మంచు పర్వతంపై భారీ హిమపాతం(avalanche) సంభవించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. నేపాల్(Nepal)లోని ముస్తాంగ్ జిల్లా(Mustang District)లో మంచుతో కప్పబడిన పర్వతాల్లో ఒక్కసారిగా అతి పెద్ద హిమపాతం సంభవించింది. దీంతో అక్కడున్నవారందరూ భయంతో అరుస్తూ పరుగులు తీశారు. అంతే అప్పటివరకు ఎంతో అందంగా కనిపించిన ప్రాంతం కాస్త ఒక్కసారిగా భయానకంగా మారింది. తెల్లటి బిళ్లలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు కనిపించడం వలన అనేక మంది రక్షణ కోసం పరిగెత్తడం కనిపించింది.
Also Read: Viral Video: అయ్యో కొత్త జంట గ్రాండ్ ఎంట్రీ ఇద్దామనుకుంటే ఇలా అయ్యిందేంటీ..!
ఈ మంచు స్లైడ్ ఘటనలో ఏడుగురు విద్యార్థుల(Students)తో సహా 11 మంది గాయపడ్డారు. మంచు ఒక పాఠశాలపైకి దొర్లినట్లు వార్తా సంస్థకు ఒక అధికారిని చెప్పారు. ” పరిసర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాం. హిమపాతం 30 నిమిషాల పాటు కొనసాగింది. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ ప్రాణనష్టం జరగలేదు. గాయపడిన వారిలో ఎక్కువ మంది స్థానిక పాఠశాల విద్యార్థులు,” చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ముస్తాంగ్ అని నేత్ర ప్రసాద్ శర్మ చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి